T20 Series: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇండియాపై ఘన విజయం సాధించింది.  211 పరుగుల భారీ స్కోరు సాధించినా..సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల ముందు టీమ్ ఇండియా బౌలర్లు చేతులెత్తేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది దక్షిణాఫ్రికా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 తరువాత దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో టీమ్ ఇంియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టీ20 ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా ఆరంభం నుంచే ధాటిగా ఆడసాగింది. తొలి ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడుతున్న సమయంలో తొలి వికెట్ రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చెలరేగి ఆడారు. పది ఓవర్లు ముగిసేసరికి 102 పరుగులు పూర్తి చేసేశారు. ఇషాన్ కిషన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో 76 పరుగుల వద్ద ఇషాన్ అవుటయ్యాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 


ఆ తరువాత 212 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలో షాక్ తగిలింది. కెప్టెన్ బవుమా పది పరుగులకు తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత 61 పరుగుల వద్ద రెండవ వికెట్ ప్రిటోరియస్ అవుటయ్యాడు. ఓ దశలో కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్, డుస్సెన్‌ విజృంభించి ఆడటం ప్రారంభించారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని..జట్టును విజయం వైపుకు నడిపించసాగారు. ఈ దశలో 3 వికెట్ల నష్టానికి 17 ఓవర్లలో 178 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. 18వ ఓవర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డుస్సెన్, మిల్లర్‌లు మరోసారి విజృంభించారు. ఈ ఓవర్‌లో 21 పరుగులు సాధించారు. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 19వ ఓవర్‌లో మరో 8 పరుగులు చేయడంతో చివరి ఓవర్‌లో 4 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. 20వ ఓవర్ తొలి బంతిని బౌండరీకు తరలించడంతో దక్షిణాఫ్రికా విజయం ఖరారైంది. టీమ్ ఇండియాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ప్రదర్శించింది. 


Also read: India vs South Africa: చెలరేగిన టీమిండియా ఆటగాళ్లు..దక్షిణాఫ్రికా ముందు భారీ స్కోర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి