South Africa T20I Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా.. ఏకంగా 517 పరుగులు!
South Africa T20I Record: South Africa Chase T20-Record 259 Runs vs West Indies. టీ20ల్లో అత్యధిక లక్ష్య ఛేదనను ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లోకి ఎక్కింది.
South Africa Chase T20-Record 259 Runs vs West Indies: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20ల్లో అత్యధిక లక్ష్య ఛేదనను ఛేదించిన జట్టుగా ప్రొటీస్ రికార్డుల్లోకి ఎక్కింది. వెస్టిండీస్ నిర్దేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. దాంతో ప్రపంచ రికార్డును దక్షిణాఫ్రికా తన పేరిట లిఖించుకుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ 18.5 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 259 రన్స్ చేసింది.
దక్షిణాఫ్రికా ముందు టీ20ల్లో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 245 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఛేజింగ్ కాగా.. తాజాగా ఆస్ట్రేలియా రికార్డును దక్షిణాఫ్రికా (South Africa T20I Record) బద్దలు కొట్టింది. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు చేసాయి. టీ20 మ్యాచ్‌ల్లో 200కు మించి స్కోర్లు నమోదవడమే ఎక్కువ కాగా.. 259 రన్స్ ఛేదించడం అంటే మాములు విషయం కాదు.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (118; 46 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. చార్లెస్ 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో వెస్టిండీస్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. కైల్ మేయర్స్ (51; 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాధగా.. రొమారియో షెపర్డ్ (41; 18 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
259 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (100; 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) సూపర్ సెంచరీ బాదాడు. ఫోర్లు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తించాడు. మరోవైపు రిజా హెండ్రిక్స్ (68; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 సిక్సర్లు నమోదయ్యాయి. ఓ టీ20 మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.
Also Read: iPhone 14 Price Cut: భారీ ఆఫర్ తీసుకొచ్చిన యాపిల్.. ఐఫోన్ 14 కేవలం 34 వేలకే! లిమిటెడ్ స్టాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.