South Africa vs Netherlands match turning point: టీ20 ప్రపంచకప్‌ 2022లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యంను  ఛేదించలేక సఫారీ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్‌ మాత్రమే చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. సె మీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా.. సొంత తప్పిదాలతో టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించడంతో.. గ్రూప్ 2లో 6 పాయింట్లు కలిగిన భారత్ సెమీస్ చేరింది. నేడు జింబాబ్వే జరగనున్న మ్యాచ్‌తో సంబంధం లేకుండా నేరుగా రోహిత్ సేన సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో సెమీస్‌ బెర్త్‌ పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. గ్రూప్ 1 నుంచి న్యూజీలాండ్, ఇంగ్లండ్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. 


ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. స్టెఫాన్ మైబర్గ్ (37), టామ్ కూపర్ (35), కొలిన్ అక్కెర్‌మన్ (41) పరుగులు చేశాడు. ముఖ్యంగా కొలిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. టామ్ కూపర్ అతనికి మంచి సహకారం అందించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్‌ నోర్జే, మార్క్రమ్‌లకు తలో వికెట్‌ దక్కింది. 


159 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆదిలోనే చేతులెత్తేసింది. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (13), టెంబా బావుమ (20) నిరాశపరిచారు. కీలక సమయంలో రిలీ రొస్సొ (25), ఎయిడెన్ మార్క్‌రమ్(17), డేవిడ్ మిల్లర్ (17), హెన్రిక్ క్లాసెన్ (21) చేతులెత్తేశారు. దాంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లల్లో 8 వికెట్లను నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఓ సింగల్ క్యాచ్. అత్యంత ప్రమాదకర డేవిడ్ మిల్లర్.. డచ్ ఫీల్డర్ అద్భుత ఫీల్డింగ్ కు బలయ్యాడు. 



దక్షిణాఫ్రికా ఇన్నింగ్ 16వ ఓవర్‌ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. బ్రాండన్ గ్లోవర్ రెండో బంతిని అవుట్ సైడ్ ఆఫ్‌గా విసిరగా..  షార్ట్ ఫైన్ లెగ్ దిశగా డేవిడ్ మిల్లర్ భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌ తీసుకున్న బంతి గాల్లోకి ఎగిరింది. డచ్ ఫీల్డర్ వాన్ డెర్ మెర్వ్ పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ వాన్ అందుకోకుంటే.. మిల్లర్ చెలరేగేవాడు. దాంతో ప్రొటీస్ విజయం సాధించేది. అందుకే ఈ క్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. 


Also Read: Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2022ను భారత్ గెలిస్తే.. పెద్ద కేక్ కట్‌ చేస్తా: విరాట్‌ కోహ్లీ  


Also Read: Shani Gochar 2023: శని గ్రహం సంచారం వల్ల ఈ రాశువారికి.. ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం మొదటి నెల దాకా డబ్బే డబ్బు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి