Moin Ali: ఐపీఎల్ 2022 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ఆటగాడు తొలిమ్యాచ్‌కు దూరమౌతున్నాడని ఆ జట్టు అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీకు మరో 48 గంటల సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటివరకూ నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 2021 టైటిల్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. తొలిమ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మార్చ్ 26వ తేదీన తొలిరోజే తలపడనుంది. మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో ఐదవసారి టైటిల్ గెల్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో తొలిమ్యాచ్ సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య జరగనుంది. 


అయితే ఇప్పుడీ తొలిమ్యాచ్ ప్రారంభానికి ముందే చైన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మొయిన్ అలీ..తొలి మ్యాచ్‌కు దూరమౌతున్నాడు. వాస్తవానికి మొయిన్ అలీ దూరం కానున్నాడనే విషయం గత కొద్దికాలంగా చర్చనీయాంశంగానే ఉంది. వీసా సమస్య కారణంగా సకాలంలో మొయిన్ అలీ ఇండియాకు చేరుకోకపోవచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పుడీ విషయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ అధికారికంగా ధృవీకరించారు. కేకేఆర్ తొలిమ్యాచ్‌కు మొయిన్ అలీ అందుబాటులో లేడని ప్రకటించారు. 


మొయిన్ అలీకు ఇంకా వీసా రాలేదని..బీసీసీఐతో మాట్లాడి వీసా సమస్య గురించి  చర్చించామని సీఈవో కాశీ విశ్వనాధన్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమౌతుందని..ఒకవేళ వచ్చినా క్వారంటైన్ నిబంధన ఉంది కాబట్టి..తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడని వెల్లడించారు. 


Also read: Warner vs Shaheen Afridi: ఒకరిపై మరొకరు దూసుకొచ్చిన వార్నర్, అఫ్రిది, అసలేం జరిగింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook