Sunrisers Hyderabad Vs Gujarat Titans Indians Playing XI Dream11 Team Tips: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు కీలక పోరుకు సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్‌ను సొంతగడ్డపై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ 7 విజయాలు, 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇవాళ గుజరాత్‌ను ఓడిస్తే.. ఎలాంటి సమీకణాలతో సంబంధంలేకుండా టాప్‌-4లో నిలుస్తుంది. మరోవైపు గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ రద్దవ్వడంతో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి.. టోర్నీని గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!
 
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. గుజరాత్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు సమాన సహకారం అందిస్తుంది. మ్యాచ్‌ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లు సీమ్, స్వింగ్‌తో ఇబ్బంది పెట్టొచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాట్స్‌మెన్లకు పరుగులు చేయడం ఈజీ అవుతుంది. సాయంత్రం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉంది. తేమ 68 శాతం ఉంటుంది. వర్షం పడే అవకాశం 40 శాతం ఉంది. గూగుల్ విన్ ప్రాబబిలిటీ ప్రకారం.. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం 60 శాతం ఉంది. గుజరాత్ గెలిచే ఛాన్స్ 40 శాతం ఉంది.


తుది జట్లు ఇలా.. (అంచనా)


సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్. 
[ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్].


గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి. 
[ఇంపాక్ట్ సబ్: సందీప్ వారియర్].


SRH Vs GT Dream11 Prediction:


==> వికెట్ కీపర్లు: క్లాసెన్ 
==> బ్యాటర్లు: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్
==> ఆల్ రౌండర్లు: రాహుల్ తెవాటియా, నితీష్ రెడ్డి
==> బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ


Also Read: Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter