IPL 2024, SRH vs GT Match Highlights: హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో సుదర్శన్(45), మిల్లర్ రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం లక్ష్య ఛేదనను ప్రారంభించిన గుజరాత్ కు  వృద్ధిమాన్ సాహా, కెప్టెన్ గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా సాహా సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే ఫోర్, రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో గుజరాత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సుదర్శన్.. గిల్ తో కలిసి నిలకడగా ఆడాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. డేంజరస్ గా మారుతున్న ఈ జోడిని మార్కండే విడదీశాడు. 36 పరుగులు చేసిన గిల్ ను మార్కండే పెవిలియన్ కు చేర్చాడు. 


సుదర్శన్, మిల్లర్ మెరుపులు..
సుదర్శన్ కు జతకలిసిన మిల్లర్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో స్డేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో హాస్ సెంచరీకి చేరవుతున్న సుదర్శన్ ను కమిన్స్ ఔట్ చేశాడు. అతడు 36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో 45 పరుగులు చేశాడు. సుదర్శన్ వెనుదిరిగినా మిల్లర్ ఏ మాత్రం తగ్గలేదు. వచ్చిన బాల్ ను వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. చివర్లో విజయ్ శంకర్ కూడా బ్యాట్ ఝలిపించడంతో గుజరాత్ మరో 5 బంతులు ఉండగానే విజయం సాధించింది. మిల్లర్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. 


Also Read: BAN Vs SL Test Highlights: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త డీఆర్ఎస్.. కళ్లు కనిపించలేదా భయ్యా..!


మరోసారి రాణించినా అభిషేక్..
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు తొలి వికెట్ కు 34 పరుగులు జోడించారు. మయాంక్ 16, ట్రావిస్ హెడ్ 19 పరుగులు చేసి ఔటయ్యారు. మరోసారి అభిషేక్ శర్మ (29) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోంటూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఇతడిని మోహిత్ శర్మ ఔట్ చేసి టైటాన్స్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్(24), అహ్మాద్(22), అబ్దుల్ సమద్(29) బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగుల చేసింది. మోహిత్ శర్మ మూడు వికెట్లతో సత్తా చాటాడు. 


Also read: SRH vs GT Live Score: మరోసారి చెలరేగిన అభిషేక్... గుజరాత్ టార్గెట్ ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి