ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ఇప్పటివరకూ బోణీ కొట్టని జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఒక్కటే. తమ రెండో మ్యాచ్‌ (SRH vs KKR Match In IPL 2020)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో డేవిడ్ వార్నర్ సేన ఓటమి పాలైంది. స్వల్ప లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే కేకేఆర్ ఛేదించింది. కేకేఆర్‌తో మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (SRH Captain David Warner) మాట్లాడుతూ.. ఓటమికి బాధ్యత తనదేనని చెబుతూనే జట్టు ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌పై షేన్ వార్న్ ప్రశంసలు, ఆశ్చర్యం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేవిడ్ వార్నర్ (David Warner) ఇంకా ఏమన్నాడంటే.. ‘ఐపీఎల్ 2020 భారత్‌లో జరగడం లేదని సన్‌రైజర్స్ ఆటగాళ్లు గమనించాలి. ఇక్కడి స్టేడియాలు పెద్దవిగా ఉంటాయి. కనుక పవర్ హిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ అందుబాటులో లేడని గమనించాలి. నేను ఔటయ్యాక 20 పరుగులు చేయడానికి నాలుగైదు ఓవర్లు ఆడారు. అయితే డగౌట్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ ఉన్నారని ఆలోచన లేకుండా డాట్ బాల్స్ ఆడుతున్నారు (మనీశ్ పాండే, సాహా). టీ20 మ్యాచ్‌లో 35, 36 డాట్ బాల్స్ ఆడారంటే క్షమించకూడదు.  KKR vs SRH match: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్


ఏ దశలోనూ ఎదురుదాడి చేయకుండా నింపాదిగా డిఫెన్స్ ఆడుతున్నారు. ఇలా చేస్తే విజయాలు ఎలా సాధ్యమవుతాయి. 20 ఓవర్లు పూర్తయ్యాక కూడా ఇద్దరు ఫించ్ హిట్టర్స్ బ్యాటింగ్ కోసం చూస్తూనే ఉన్నా జట్టు నుంచి పరుగులు రాలేదు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా హిట్టింగ్ చేయాలి. దూకుడు ప్రదర్శిస్తేనే విజయాలు సాధ్యం. మనం ఆడుతోంది భారత్‌లో మాత్రం కాదు. దుబాయ్‌లో పెద్ద స్టేడియాల కారణంగా బౌండరీలు అంత ఈజీ కాదు. మరింత ప్రాక్టీస్ చేస్తేనే ఇది సాధ్యమని’ సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టు ఆటగాళ్లకు చురకలు అంటిస్తూనే ఓటమికి బాధ్యత వహించడం గమనార్హం. CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం! 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe