Sunil Gavaskar Break his Anger: ప్రస్తుతం టీమిండియా శ్రీలంక జట్టుతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది.తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 222 పరుగులతో విజయం సాధించగా.. తరువాత మ్యాచ్ లో కూడా విజయం సాధించి.. శీలంక జట్టును క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. అయితే టీమిండియా కెప్టెన్ పై వెటరన్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ విరుచుకుపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ బ్యాట్స్‌మెన్‌పై సంచలన వ్యాఖ్యలు 
వెటరన్ బ్యాట్స్‌మెన్ వివాదాస్పద వ్యాఖ్యల గురించి తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇపుడు గవాస్కర్ టీమిండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. "శుభ్‌మన్ గిల్‌ బయట కూర్చొని తన ప్రతిభను వృధా చేయుకుంటున్నాడు. రంజీ ట్రోఫీలోనే కాకుండా గత రెండు నెలలుగా శుభమాన్ గిల్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. దేశానికి ఆడాలని ఉంటే.. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ.. క్రికెట్ ఆడుతూ మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. కానీ శుభ్‌మన్ గిల్‌ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి.. ఇలాగే కొనసాగితే తన టాలెంట్ ను బయట కూర్చోనే ముగించేస్తాడు. ఇలానే కొనసాగితే జట్టు నుండి కూడా తొలగించాల్సి వస్తుంది. 


అందుకే మయాంక్‌కి అవకాశం దక్కింది
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, 'మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, మయాంక్ అగర్వాల్ మన హోమ్ పిచ్ లపై మంచి స్కోర్ చేస్తుంటాడు.. కానీ ఓవర్సీస్‌లో పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. అదేవిధంగా మూడో స్థానంలో వచ్చే హనుమ విహారి.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో  అవకాశం పొంది మరియు మంచి బ్యాటింగ్ ను కనబరిచాడు. కావున హనుమ విహారి వంటి వారికి అవకాశం ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేసాడు. శుభ్‌మన్ గిల్ కు ఓపెనింగ్ లేదా 3వ నంబర్‌లో అవకాశం కల్పించిన ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 


మయాంక్ ఔట్ కావచ్చు
మయాంక్ అగర్వాల్ నుండి టీమిండియా అభిమానులు మరియు కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆశించారు, కానీ క్రీజులో నిలవలేకపోయాడు. మయాంక్ అగర్వాల్ పేలవ ఫామ్‌తో పోరాడుతున్నాడు. మయాంక్ ఆడిన గత 6 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో, మయాంక్ అగర్వాల్ కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది, ఎందుకంటే భారత జట్టులో చాలా ఎక్కువ మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. మయాంక్ అగర్వాల్‌కు అవకాశాలు ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మ మరియు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 


Also Read: Radhe Shyam: రాధేశ్యామ్‌కు తప్పని కొత్త జీవో చిక్కులు.. ఇంకా ఓపెన్ కాని టికెట్స్ కౌంటర్స్!!


Also Read: UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరు... కాషాయ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook