ఐపిఎల్ 2020 టోర్నమెంట్ సమీపిస్తున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings team ) జట్టు ఆటగాళ్లు సోమవారమే చెన్నైకి చేరుకున్నారు. మార్చి 29 నుంచి ఐపిఎల్ ప్రారంభమవనున్న నేపథ్యంలో క్రికెట్ ప్రాక్టీసుపై దృష్టిసారించేందుకు సీఎస్‌కే ఆటగాళ్లంతా చెన్నై బాటపట్టారు. అందులో భాగంగానే ఆ జట్టుకు మూడుసార్లు (2010, 2011, 2018) విజయాన్ని అందించిన మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) సైతం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. అనంతరం ప్రాక్టీసు కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కి చేరుకుంటున్న ఆటగాళ్లకు ధోని స్వయంగా స్వాగతం పలుకుతూ కనిపించాడు. ఈ క్రమంలోనే సీఎస్‌కే జట్టులోకి వచ్చిన సురేష్ రైనాకు (Suresh Raina) సైతం ధోనీ స్వాగతం పలకగా.. ధోనీని చూడటంతోనే రైనా వెళ్లి ధోనీని గట్టిగా హత్తుకున్నాడు. అంతేకాకుండా ధోనీ మెడపై ఓ చుమ్మా కూడా ఇచ్చుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ధోనీని ముద్దుగా తళా అని, రైనాను చిన్న తళా అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది జులై 9న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రంఫోర్డ్ స్టేడియంలో వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజీలాండ్‌తో చివరిసారిగా మ్యాచ్ ఆడిన ధోనీకి ఈ ఐపిఎల్ ఓ అగ్నిపరీక్ష కానుంది. ఈ ఐపిఎల్‌లో ధోనీ అద్భుతమైన ప్రతిభ కనబరిస్తే కానీ ఇదే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకునే ఛాన్స్ లేదు.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings team ) :
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టేన్), శార్ధూల్ థాకూర్, కేఎం ఆసిఫ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, కరణ్ శర్మ, హర్బజన్ సింగ్, ఎన్ జగదీశన్, మోనూ కుమార్, మిచెల్ శాంతనర్, రవీంద్ర జడేజా, లుంగి ఎంగిడి, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, మురళీ విజయ్, డు ప్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, శామ్ కరన్, పీయుష్ చావ్లా, జోశ్ హెజల్‌వుడ్, ఆర్ సాయి కిషోర్


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..