దాదాపు దశాబ్దంన్నర కాలంపాటు భారత జాతీయ జట్టు (Team India)కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించడం (Suresh Raina Retirement) తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొంత సమయానికే రైనా సైతం అదే బాటలో నడిచాడు. అత్యుత్తమ క్రికెటర్‌గా, బెస్ట్ ఫీల్డర్‌గా రైనా అందించిన సేవల్ని కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాజీ క్రికెటర్ రైనాకు లేఖ (PM Modi Letter To Suresh Raina) రాశారు. తన సేవల్ని గుర్తించినందుకు ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. Gold Price India: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘థ్యాంక్యూ నరేంద్ర మోదీజి.. దేశం కోసం ఆడేటప్పుడు మేం చెమట చిందిస్తాం. శక్తివంచన లేకుండా ఆడతాం. దేశ ప్రజలతో పాటు ప్రధాని సైతం మా సేవల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చిన సందేశాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నాను. జై హింద్’ అని రైనా ట్వీట్ చేశాడు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి



నీలో ఇంకా క్రికెట్ దాగి ఉంది: ప్రధాని మోదీ
‘ఆగస్టు 15న నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకున్నావు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ ప్లేయర్‌గా కనిపించే నువ్వు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతావని ఊహించలేదు. నీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా మిగిలే ఉంది. భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలు అందించావు. ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడావు. నీ సెకండ్ ఇన్నింగ్స్ సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని’ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రైనాకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు.   Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos