Suryakumar Yadav Post: నీ కోసం ఎదురుచూస్తున్నా.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్!
Suryakumar Yadav Likely to play India vs Australia 1st Test. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.
Suryakumar Yadav Likely to play India vs Australia 1st Test: ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌లలో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. లేటు వయసులో భారత జట్టులోకి వచ్చినా.. తక్కువ కాలంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు కీలక బ్యాటర్‌గా మారిపోయాడు. టీ20ల్లో ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్న సూర్య.. వన్డేల్లోనూ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక సూర్య టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడాలనే కల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023తో నెరవేరనుంది. ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో సూర్యకుమార్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
మిడిల్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే వికెట్ కీపర్ రిషబ్ పంత్.. 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దాంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ లోటును సూర్యకుమార్ యాదవ్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. సూర్యకుమార్ కూడా టెస్టు మ్యాచ్‌లో ఛాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తనకు మొదటి టెస్టులో ఛాన్స్ ఖాయం అన్నట్టుగా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎరుపు బంతి ఫోటోని ఉంచి.. 'హలో ఫ్రెండ్' అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఫాన్స్ అందరూ సూర్యకు అభినందనలు తెలుపుతున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తర్వాతి స్థానాల్లో ఆడతారు. దీంతో సూర్యని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దింపే అవకాశముంది. రాహుల్ కీపర్ బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ సూర్యకు టెస్టుల్లో అవకాశం దక్కితే.. టెస్టుల్లో ఏం మేరకు రాణిస్తాడో చూడాలి.
Also Read: Best Mahindra Cars 2023: రూ 5.50 లక్షలకే మహీంద్రా ఎక్స్‌యూవీ 500.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.