Suryakumar Yadav Test Debut: టెస్టుల్లో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం.. ఎట్టకేలకు ఫలించిన కల! నెరవేసిన భరత్ చిరకాల ఆకాంక్ష
KS Bharat receive Debut Test Cap in IND vs AUS 1st Test. భారత్ తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ కల నెలవేరింది.
KS Bharat, Suryakumar Yadav receive Debut Test Caps in IND vs AUS 1st Test: భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు ఫలించింది. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అదరగొట్టిన సూర్య.. టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లోని తొలి టెస్టులో సూర్యకుమార్ చోటు దక్కించుకున్నాడు. దాంతో భారత్ తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సూర్య కల నెలవేరింది. టీ20, వన్డేల్లో రాణించిన సూర్య భాయ్.. సాంప్రదాయ ఫార్మాట్లో ఎలా రాణిస్తాడో చూడాలి.
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ఆరంభం అయింది. టాస్‌కు ముందు సహచరుల కరతాళ ధ్వనుల నడుమ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav Test Debut) 'టీమిండియా క్యాప్' అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్, స్టార్ కామెంటేటర్ రవిశాస్త్రి చేతుల మీదుగా సూర్య క్యాప్ అందుకున్నాడు. అనంతరం సూర్య ఉద్వేగానికి లోనయ్యాడు. రవిశాస్త్రి క్యాప్ అందిస్తున్న సమయంలో సూర్య ఫ్యామిలీ మెంబర్స్ పక్కనే ఉండి సంతోషించారు.
మరోవైపు భారత జాతీయ జట్టుకు ఆడాలన్న ఆంధ్ర రంజీ ప్లేయర్ కోన శ్రీకర్ భరత్ చిరకాల ఆకాంక్ష కూడా నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా భరత్ అరంగేట్రం (KS Bharat Test Debut) చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ చేతేశ్వర్ పుజారా చేతుల మీదుగా భరత్ క్యాప్ అందుకున్నాడు. రిషబ్ పంత్ గాయం బారిన పడడంతో.. వికెట్ కీపర్‌గా భరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. భరత్ టెస్టులో అద్భుతంగా రాణించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానంపై ఉన్న పచ్చికను భారత పేసర్లు సద్వినియోగం చేసుకొన్నారు. ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1)లను పెవిలియన్ చేర్చారు. మొహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఖవాజా ఎల్బీ కాగా.. వార్నర్‌ను మొహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్నస్ లబుషేన్ (13), స్టీవ్ స్మిత్ (6) ఉన్నారు.
Also Read: IND vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. గిల్, ఇషాన్ ఔట్! భారత్ తుది జట్టు ఇదే
Also Read: Hyderabad Traffic 2023: హైదరాబాద్‌లో మరో 10 రోజులు ట్రాఫిక్ జామ్‌లే.. వాహనదారులు నరకం చూడక తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.