Surykuamr Yadav Injury: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ (Suryakumar Yadav) స‌ర్జ‌రీ విజయవంతమైంది. స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia)తో బాధప‌డుతున్న సూర్యకు బుధవారం జ‌ర్మ‌నీలో శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ క్రమంలో హాస్పిట‌ల్ బెడ్ మీద ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ''నా శస్త్రచికిత్స సక్సెస్ అయింది. నా ఆరోగ్యం తొందరగా మెరుగవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను త్వరలో తిరిగి వస్తానని'' అంటూ ఈ మిస్టర్ 360 రాసుకొచ్చాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని చీలమండలోని లిగమెంట్లు నలిగిపోయాయి. దీనినే స్పోర్ట్స్ హెర్నియా అంటారు. వైద్యపరిభాషలో దీనిని ‘'అథ్లెటిక్ పుబ‌ల్జియా'(Athletic Publgia) అని పిలుస్తారు. ఈ స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సూర్య దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ సమస్య ఎక్కువగా ఫుట్‌బాల్, రెజ్లింగ్, ఐస్ హాకీ ఆడేవాళ్లలో కనిపిస్తుంది. అరుదుగా క్రికెటర్లు ఈ వ్యాధి బారినపడతారు. రెండేళ్ల కిందట టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డ్డాడు. ఆ తర్వాత అతడు 2022లో సర్జరీ చేయించుకుని రాహుల్ పునరాగమనం చేశాడు. 



Also read: IND Vs AFG Full Highlights: ఏ మ్యాచ్‌ రా అయ్యా.. నరాలు కట్ అయ్యాయి.. రెండో సూపర్ ఓవర్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ


Also read:India vs Afghanistan: అఫ్గానిస్థాన్‌పై రోహిత్ శర్మ ఊచకోత.. టీ20ల్లో సరికొత్త రికార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter