Sushil Kumar attacking wrestler Sagar Rana with stick: సుషీల్ కుమార్.. రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన రెజ్లర్. ప్రస్తుతం మరో యువ రెజ్లర్ సాగర్ రాణా మర్డర్ కేసులో (Sagar Rana murder case) ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. మే 4న రాత్రి సుషీల్ కుమార్ తన స్నేహితులతో కలిసి సాగర్ రాణా, అతడి మిత్రులను కిడ్నాప్ చేసి న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంకి తీసుకొచ్చి వారిపై దాడి చేయగా ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్ రాణా మృతి చెందాడనేది సుషీల్ కుమార్‌పై నమోదైన ప్రధానమైన అభియోగం. సాగర్ రాణా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సుషీల్ కుమార్ పరారీలో ఉండగా అతడి కోసం తీవ్రంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు రెండు వారాల తర్వాత మే 23న గత ఆదివారం నాడు ఉదయం అతడిని అరెస్ట్ చేయగలిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, తాజాగా సాగర్ రాణా మర్డర్ కేసులో సుషీల్ కుమార్ ప్రమేయం ఉందనేందుకు మరో బలమైన ఆధారం లభించినట్టు తెలుస్తోంది. సాగర్ రాణాపై సుషీల్ కుమార్, అతడి స్నేహితులతో కలిసి కర్రతో దాడికి పాల్పడుతున్నట్టుగా ఉన్న ఓ ఫోటో (Sushil Kumar attacking Sagar Rana with stick) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూడ్డానికి ఫోటో మరీ అంత స్పష్టంగా లేనప్పటికీ.. ఫోటోలో కర్ర పట్టుకుని దాడికి పాల్పడుతున్నట్టుగా కనిపిస్తున్న వ్యక్తి మాత్రం సుషీల్ కుమార్ అని చెప్పేదిగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


Also read : IPL 2021: ఐపీఎల్ సెకండాఫ్‌లో MS Dhoni అత్యుత్తమ ప్రదర్శన చూడబోతున్నాం


సుషీల్ కుమార్ ఆదివారం అరెస్ట్ (Sushil Kumar arrested) కాగా ఇదే హత్య కేసులో అనుమానితులుగా ఉన్న అతడి నలుగురు స్నేహితులను ఢిల్లీ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నలుగురిలో హర్యానాలోని జాజ్జర్ జిల్లాకు చెందిన భూపేందర్ సింగ్ (38), మోహిత్ (22), గులాబ్ (24), రోహ్తక్ జిల్లాకు చెందిన మంజీత్ (29) ఉన్నారు. ఓ ఆస్తి తగాదా (Property dispute between Sushil Kumar and Sagar Rana) విషయంలోనే సుశీల్ కుమార్, సాగర్ రాణా విషయంలో విభేధాలు తలెత్తి అది హత్యకు దారితీసినట్టు ఢిల్లీ పోలీసులు సుశీల్ కుమార్‌పై ఎఫ్ఐఆర్‌లో (FIR against Sushil Kumar) పేర్కొన్నారు.


Also read : IPL 2021: ఐపీఎల్ ప్రేమికులకు శుభవార్త, సెప్టెంబర్‌లో మిగతా మ్యాచ్‌ల నిర్వహణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook