Sunil Gavaskar says Indian team have more support staff than players: భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ ఉండగా.. బ్యాటింగ్‌ కోచ్‌ అవసరం లేదని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్ అన్నారు. టీమిండియాలో ఎక్కువ మంది స్టాఫ్‌ ఉండటంతో బ్యాటర్లు గందరగోళానికి గురవుతారన్నారు.  డ్రెస్సింగ్‌ రూంలో ఆటగాళ్ల కన్నా సపోర్ట్‌ స్టాఫ్‌ ఎక్కువగా ఉన్నారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్స్‌లో భారత్‌ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న సందర్భంగా సన్నీ పై విధంగా స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆజ్ తక్‌లో జరిగిన చర్చలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'గొప్ప బ్యాటర్‌లలో ఒకరైన రాహుల్ ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్నపుడు.. బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు. ద్రవిడ్ ఏదైనా ఐడియా చెప్పినప్పుడు.. విక్రమ్ రాథోర్ ఇంకేదో ఐడియా చెపుతాడు. అప్పుడు బ్యాటర్లు గందరగోళానికి గురవుతారు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీకు సపోర్ట్‌ స్టాఫ్‌ ఎక్కువ వద్దనుకుంటే.. వారిని జట్టుతో పర్యటనకు పంపకండి. కీలకం అనుకూల వారినే తీసుకెళ్లండి' అని అన్నారు. 


'1983 ప్రపంచకప్‌ సమయంలో మాకు ఒకే ఒక్క మేనేజర్‌ ఉండేవాడు. 1985 టోర్నీలోనూ ఒక్కరే ఉన్నారు. 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కూడా పరిమిత సంఖ్యలోనే సపోర్ట్‌ స్టాఫ్‌ ఉంది. ప్రస్తుతంఅలా లేదు. జట్టు సభ్యుల కంటే సహాయక సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. సపోర్ట్‌ స్టాఫ్‌ సంఖ్య ఎక్కువైతే.. ఎవరి  సూచనలు వినాలో తెలియక ఆటగాళ్లు ఇబ్బందిపడతారు' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 


Also Read: Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ 2022.. తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!


Also Read: మీన రాశిలోకి బృహస్పతి సంచారం.. నవంబర్ 24 నుంచి ఈ ఐదు రాశుల వారికి డబ్బేడబ్బు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి