T20 World Cup 2021,  SL Vs BAN: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021)లో శ్రీలంక శుభారంభం చేసింది. చరిత్‌ అసలంక (80; 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రాజపక్స (53; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాదేశ్(Bangladesh) నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని లంక 18.5 ఓవర్లలోనే ఛేదించింది. లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక(Srilanka)కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. కుశాల్‌ పెరీరా (1)ని నసూమ్‌ పెవిలియన్‌కి పంపాడు. తర్వాత వచ్చిన అసలంక.. ఓపెనర్ నిశాంక (24)తో కలిసి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాడు. ముఖ్యంగా హసలంక ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.


Also read: T20 World Cup IND vs PAK: రాహుల్‌, ధోనిలను బతిమలాడిన పాక్ అభిమానులు


అయితే, షకీబ్‌(Shakib Al Hasan) వేసిన తొమ్మిదో ఓవర్లో నిశాంక, ఫెర్నాండో (0) ఔటయ్యారు. తర్వాతి ఓవర్లోనే హసరంగ (6) కూడా పెవిలియన్‌ చేరాడు. మహ్మదుల్లా వేసిన 14 ఓవర్‌లో అసలంక(Charith Asalanka) రెండు సిక్సర్లు బాదాడు. సైఫ్‌ఉద్దీన్‌ వేసిన 16 ఓవర్లో రాజపక్స చెలరేగి ఆడాడు. ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదేయడంతో శ్రీలంక విజయం ఖరారైపోయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ హల్‌ హసన్‌, సైఫ్‌ఉద్దీన్  రెండు వికెట్లు తీయగా.. నసూమ్ వికెట్ పడగొట్టాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook