T20 World Cup 2021 India vs Pakistan: పాకిస్తాన్ తో ఇది వరకు జరిగిన మ్యాచ్ లో భారత్ ఓపెనర్లు ఇలా సింగిల్ డిజిట్ అవటం ఇది మూడో సారి... 2007 టీ 20 వరల్డ్ కప్ లో గంభీర్ 0 రన్స్ తో ఔటవ్వగా సెహ్వాగ్ 5 పరుగుకు చేసి పెవిలియన్ చేరాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా 2016 లో ఆసియా కప్ లో కూడా ఇలానే జరగటం విశేషం. ఆసియా కప్ లో రోహిత్ శర్మ మరియు రహానే డకౌట్ అయ్యారు.. 


ఈ రోజు జరుగుతున్న టీ 20 వరల్డ్ లో కూడా రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా.. కేఎల్ రాహుల్ 3 పరుగుల వద్ద ఔటయ్యారు. ఇలా జరిగిన రెండు సార్లు కూడా భారత్ కప్పు కొట్టడం విశేషం.. ఈ సారి కూడా ఇలానే జరుగుతుందని.. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. 
 


హిస్టరీ... 
చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో (New Zealand) జరిగిన వరల్డ్‌ కప్‌లో (World Cup 2019) భాగంగా  జూన్‌ 16 2019 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్‌ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం... అది కూడా పొట్టి ప్రపంచకప్ (T20 World Cup)లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. 


ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు ఏడూ సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి.. 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్ లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచక‌ప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది. హిస్టరీ రిపీట్ అవుతుందా..?? లేక హిస్టరీని తిరగరాస్తారా తెలియాలంటే వేచి ఉండాల్సిందే.. !!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి