Rishab Pant: ఒంటి చేత్తో కళ్లు చెదిరే సిక్స్ కొట్టిన పంత్.. వీడియో వైరల్
T20 World Cup 2021: ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత ఆటగాడు రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
Rishab Pant: టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021)లో భాగంగా.. సోమవారం ఇంగ్లండ్(England)తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishab pant) ఒంటి చేత్తో కొట్టిన సిక్స్ వైరల్‌గా మారింది. మొయిన్ అలీ బౌలింగ్ ఇన్నింగ్స్ 13.4 ఓవర్‌లో లాంగాఫ్ దిశగా ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. అతని సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also read: India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా
సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్(Warm up Match)లో పంత్ (14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు నాటౌట్) టీమిండియా(Teamindia)ను గెలిపించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్ 70(రిటైర్డ్‌హర్ట్), కేఎల్ రాహుల్ 51 పరుగులతో ఆకట్టుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి