Sunil Gavaskar slams Virat Kohli: టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీపై, టీమిండియా మేనేజ్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యూజిలాండ్‌తో ఆదివారం నాడు జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓటమికిగల కారణాలను విశ్లేషిస్తూ.. కోహ్లీపై, టీమిండియా మేనేజ్‌మెంట్‌పై గవాస్కర్ మండిపడ్డాడు. టీమిండియా ఓపెనర్ అయిన రోహిత్ శర్మను న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో ఎందుకు బ్యాటింగ్‌కి దించాల్సి వచ్చిందని గవాస్కర్ ఫైర్ అయ్యాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్‌ని (Trent Boult) రోహిత్ శర్మ ఎదుర్కోలేడని అతడిపై నమ్మకం లేకే టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోందని సునిల్ గవాస్కర్ అసహనం వ్యక్తంచేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ నిష్ణాతుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) ముగిసిన అనంతరం టీ20 జట్టు కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో కేప్టేన్ అయ్యే అర్హతలు ఉన్న వాడు కూడా రోహిత్ శర్మనే అనే విషయాన్ని మర్చిపోకూడదు అని సునిల్ గవాస్కర్ హితవు పలికాడు. 


ఎప్పుడూ ఓపెనింగ్‌కి వెళ్లే రోహిత్ శర్మను ఆదివారం మూడో స్థానంలో బ్యాటింగ్‌కి దింపిన మేనేజ్‌మెంట్.. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను (Ishan Kishan, KL Rahul) పంపించింది. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలన్న టీమిండియా ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి టీమిండియా 110 పరుగులే చేసింది.


ఇషాన్ కిషన్ హిట్ ఆర్ మిస్ ప్లేయర్ లాంటివాడు. అతడిని 4వ స్థానంలో లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ కి దింపింతే అప్పుడు పరిస్థితులనుబట్టి ఆడే ఆటగాడు. అలాంటిది అతడిని ఓపెనర్ గా దించి ఓపెనర్ అయిన రోహిత్ శర్మను (Rohit Sharma) మూడో స్థానంలో దించడం వల్ల ప్లాన్ అంతా బెడిసికొట్టింది అని సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. 


''ఇలా చేయడం వల్ల ఏళ్ల తరబడి ఓపెనర్‌గా రాణిస్తున్న రోహిత్ శర్మ లాంటి ఆటగాడికి కూడా తనపై తాను నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. తాను రాణించలేనేమోననే తన స్థానాన్ని మరొకరికి ఇచ్చారనే ఫీలింగ్ వారిని కృంగిపోయేలా చేస్తుంది. పోనీ.. ఇషాన్ కిషన్ కష్టపడి 70 పరుగులు చేసినా అతడిని పొగడ్తల్లో ముంచెత్తి ఉండే వాళ్లం. కానీ ఇషాన్ విషయంలో అలా కూడా జరగలేదు. అలాంటప్పుడు ఇలా విమర్శలు ఎదుర్కోకతప్పదు'' అంటూ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar slams Virat Kohli, India team management) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశాడు.