Australia vs Ireland: ఐర్లాండ్ పై ఆసీస్ గెలిచే... సెమీస్ ఆశలు నిలిచే...!
Australia vs Ireland: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ రేసులో నిలిచింది. ఐర్లాండ్ పై గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది ఆసీస్. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సత్తా చాటింది. ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ఐర్లాండ్ పై గెలుపొందింది. ఈ గెలుపుతో కంగూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కానీ నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉండటం ఆ జట్టును కొద్దిగా కలవరపెట్టే ఆంశం.
సూపర్-12 పోరులో భాగంగా.. సోమవారం బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియ, ఐర్లాండ్ (Australia vs Ireland) లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ అర్థ సెంచరీతో (63) మెరవగా.. స్టాయినిస్ ((35) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తి (3/29), జోష్ లిటిల్ (2/21) సత్తా చాటారు.
లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 18.1 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. టక్కర్ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ విఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసిన టక్కర్ 48 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టార్క్, జంపా, కమిన్స్, మ్యాక్స్ వెల్ లు రెండేసి వికెట్లు చొప్పున తీశారు. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఫించ్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసీసీ గెలుపు కంటే ఆ జట్టు కీలక ఆటగాళ్లు ఫించ్, స్టాయినిస్, టిమ్ డేవిడ్ గాయాల బారిన పడడం ఆందోళన కలిగించే విషయం. గ్రూప్-1 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఆసీస్ ఈ విజయంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
Also Read: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టూర్‌లకు భారత జట్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook