India vs Netherlands Predicted Playing 11: టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup 2022) దాయాదిని మట్టికరిపించి టీమిండియా తన వేటను ఘనంగా మెుదలుపెట్టింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరుపురాని విజయాన్ని అందుకున్న భారత్.. ఇవాళ పసికూన నెదర్లాండ్స్‌తో పోరుకు (India vs Netherlands) సిద్ధమైంది. ఈ మ్యాచ్ 12.30 గంటలకు సిడ్నీ వేదికగా ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పులో కొన్ని మార్పులు చేర్పులు చోటుకునే అవకాశం కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత బ్యాటింగ్ విషయానికొస్తే.. చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ లో విఫలమైన కేఎల్ రాహుల్ ను అలానే కొనసాగించనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ తో నైనా గాడిన పడాలని జట్టు యజమాన్యం భావిస్తోంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాండ్యాల ఫామ్ భారత్ కు సానుకూలాంశం. అయితే వికెట్ దినేశ్ కార్తీక్ కు మరో అవకాశం ఇవ్వనున్నారు. అయితే పాక్ తో గేమ్ లో రనౌటైన అక్షర్ పటేల్ స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్షర్ బౌలింగ్ లోనూ కుడా విఫలమవ్వడంతో అతడికి జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. 


ఇక బౌలింగ్ విషయానికోస్తే.. భువనేశ్వర్, అర్ష్ దీప్ కొత్త బంతిని పంచుకుంటారు. మూడో పేసర్ గా షమీ, నాలుగో పేసర్ గా హార్దిక్ కొనసాగుతారు. ఇక స్పిన్ విషయానికొస్తే.. పాక్ తో మ్యాచ్ లో బౌలింగ్ లో విఫలమైన ఆశ్విన్ స్థానంలో చాహల్ ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ లో నెదర్లాండ్స్ జట్టు ఇంతవరకు టీమిండియాతో తలపడింది లేదు. 


భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ (సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ / యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ / రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ. 


Also Read: T20 World Cup 2022: పసికూన నెదర్లాండ్స్‌తో టీమిండియా పోరు నేడే... మధ్యాహ్నం 12.30 నుంచి మ్యాచ్ ప్రారంభం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి