పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయం.. ఇలా అయితే భారత్ సునాయాసంగా సెమీ ఫైనల్‌కు చేరుతుంది!
T20 World Cup 2022 Semi Final qualification scenario for india. పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్‌కు వెళ్లడం చాలా సులువైంది. మరో 3 జట్లను ఓడిస్తే టీమ్ భారత్ సెమీస్ చేరుకుంటుంది.
T20 World Cup 2022 India Semi Final Chances: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయం సాధించింది. చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. మెగా టోర్నీ సెమీ ఫైనల్‌కు వెళ్లడం చాలా సులువైంది. మరో 3 జట్లను ఓడిస్తే టీమ్ భారత్ సెమీస్ చేరుకుంటుంది. అది ఎలాగో తెలుసుకుందాం?.
టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ గ్రూప్-2లో ఉంది. ఈ గ్రూపులో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లు ఉన్నాయి. సోమవారం జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇరు జట్లు 1-1 పాయింట్లతో సరిపెట్టుకున్నాయి. సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే.. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవాల్సి ఉంది. అనేకాదు మంచి రన్ రేట్ కూడా ఉండాలి.
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ 2 పాయింట్లు సాధించి గ్రూప్-2లో రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే.. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేలను భారత్ ఓడించాలి. అప్పుడు భారత్ 8 పాయింట్లు సాధించి సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అక్టోబర్ 31న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే.. భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆటగాళ్ల ఫామ్ చూస్తే కచ్చితంగా భారత్ సెమీస్ చేరుతుంది.
ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి టీమిండియా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. అయితే ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ పటిష్టంగా ఉంది. చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి మ్యాచ్ వినర్స్ జట్టులో ఉన్నారు. దాంతో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారుగా భారత్ కనిపిస్తోంది.
Also Read: ఆ ఒక్క కారణంతోనే హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్నా.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు!
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి