T20 World Cup, IND vs ENG: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ మేటి టీ20 జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను టీమిండియా ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లలో భారత్ ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సూపర్-12 దశలో అన్ని జట్ల కంటే అత్యుత్తమ ప్రదర్శన కనబరించి టీమిండియానే. సూపర్-12లో ఇంగ్లాండ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై ఓడిపోగా.. శ్రీలంకపై అతికష్టం మీద నెగ్గింది. అలాని ఇంగ్లీష్ జట్టును తక్కువ అంచనా వేయెద్దు. ఇవాళ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగబోతుంది. మధ్యాహ్నం  1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారిద్దరిలో ఎవరికీ ఛాన్స్?
సెమీస్ లో భారత్ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టీమిండియా మిడిలార్డర్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటుంది. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతుండటం జట్టును ఆందోళన కలిగించే అవకాశం. వీరిద్ధరినీ తుదిజట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కెప్టెన్ రోహిత్ ఫామ్ కూడా జట్టును ఇబ్బంది పెట్టేది. అతడు గాడిన పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ గత రెండు మ్యాచ్ ల్లో రాణించాడు. అదే ఫామ్ ను ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని జట్టు యజమాన్యం కోరుకుంటుంది. ఇక కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిద్ధరూ మరోసారి చెలరేగితే భారత్ కు తిరుగుండదు. హార్ధిక్ కూడా పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. బౌలింగ్ రాణిస్తున్నా.. బ్యాటింగ్ లో  ఆశించిన మేర ఆటడం లేదు. అర్ష్‌దీప్‌, షమి, భువిలతో కూడిన పేస్‌ త్రయం ఇప్పటి వరకు బాగానే రాణించింది. స్పిన్నర్లు అయిన ఆశ్విన్, అక్షర పటేల్, చాహల్ ల్లో ఎవరికీ ఛాన్స్ ఇస్తారో చూడాలి. 


ఇంగ్లీష్ జట్టుకు గాయాల బెడద


ప్రస్తుత టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. అయితే బట్లర్‌, హేల్స్‌, స్టోక్స్‌, మలన్‌, బ్రూక్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌లతో కూడి బ్యాటింగ్ లైనప్ ఆ జట్టుకు ఉంది. చివరి వరుకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఆజట్టుకు ఉన్నారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న మలన్‌, వుడ్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే వారి స్థానంలో సాల్ట్‌, జోర్డాన్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ జట్టు బౌలింగ్ లో కొంత ఇబ్బంది పడుతుంది. కరన్‌, వుడ్‌, వోక్స్‌, రషీద్‌ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ కీలక సమయంలో వారు చేతులెత్తేస్తున్నారు. మరి ఈ సారి ఏం చేస్తారో చూడాలి. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ మూడుసార్లు తలపడితే భారత్ రెండు సార్లు, ఇంగ్లాండ్ ఒకసారి నెగ్గాయి.


భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌/అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌.


Also Read: IND vs ENG Matches: ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచుల్లో ఎవరు ఎక్కువ గెలిచారో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి