T20 World Cup 2022, Netherlands vs South africa: టీ20 ప్రపంచకప్‌లో పసికూన నెదర్లాండ్స్‌ అదరగొట్టింది. బలమైన సఫారీ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్ లో అడుగుపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడిలైడ్‌ వేదికగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా (South africa) జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్(Netherlands) నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లల్లో మైబర్గ్‌ 37 , మ్యాక్స్‌ ఓడ్వడ్‌ 29, టామ్‌ కూపర్‌ 35, అక్రమన్‌ 41 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దక్షిణాఫ్రికాను 145 పరుగులకే పరిమితం చేసింది నెదర్లాండ్స్. సఫారీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్‌ బౌలర్‌ బ్రాండన్‌ గ్లోవర్‌ మూడు వికెట్లు ప్రోటీస్ వెన్నువిరిచాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రోస్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 


సెమీస్ కు వెళ్తుందని అనుకున్న సఫారీ జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ గెలిచి టీమిండియాను సెమీస్ కు చేర్చింది. చిన్న జట్లను తక్కువగా అంచనా వేయకూడదని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం గ్రూప్-2 నుండి భారత్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇవాళ పాక్‌ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో  ఎవరో గెలుస్తారో వారు రెండో సెమీస్ బెర్తు దక్కించుకుంటారు. భారత్, జింబాబ్వేలు ఇవాళే తలపడనున్నాయి. 


Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు.. ఆ ఇద్దరికి ఛాన్స్‌ ఇస్తారా..? తుది జట్లు ఇవే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి