టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత మహిళా జట్టు తడబాటుకు లోనైంది. అవతలివైపు ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడంతో తొలిసారి పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న భారత్ అటు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లోనూ సమష్టిగా వైఫల్యం చెందింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గే ఛాన్స్ చేజార్చుకుంది. టీ20 ప్రపంచ కప్ జరిగిన 6 పర్యాయాలు ఫైనల్ చేరిన ఆసీస్ ఫైనల్లో పరిపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. 5వ పర్యాయం పొట్టి ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..


ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌పై 85 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసీస్ మరోసారి కప్పును కైవసం చేసుకుంది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్లు అలిస్సా హేలీ (75: 39 బంతుల్లో 7x4, 5x6), మూనీ (78 నాటౌట్: 54 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లాడి  4 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా. పూనమ్ యాదవ్, రాధ యాదవ్ చెరో వికెట్ దక్కింది.



185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. తొలి ఓవర్ మూడో బంతికే కీపర్ అలీస్సా హెలీ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు భారత యువ సంచలనం షెఫాలీ వర్మ(2) ఔటైంది. ఆపై తానియా భాటియా రిటైర్డ్ హర్ట్, ఇక అది మొదలు భారత మహిళలు ఒక్కొక్కరిగా వికెట్లు సమర్పించుకున్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (4) విఫలమైంది. జేమీ రోడ్రిగ్స్ డకౌట్ అయింది. దీప్తి శర్మ (33) టాప్ స్కోరర్. 99 పరుగుల వద్ద పూనమ్ యాదవ్‌ను స్కట్ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ రికార్డు స్థాయిలో 5వ సారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. భారత్ తమ చివరి 5 వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో స్కట్ 4/18, జొనాసెన్ 3/20 భారత మహిళల పతనాన్ని శాసించారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..