Team india for T20 world cup: ఐసిసి టీ20 వరల్జ్ కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లతో జట్టు వివరాలను వెల్లడించింది. సెప్టెంబరు 10 లోగా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు వెల్లడించాలన్న ఐసీసీ నిబంధనలకు లోబడి బీసీసీఐ మరో రెండు రోజులు ముందుగానే సెప్టెంబర్ 8న జట్టు ప్రకటన చేసింది. అక్టోబరు 10వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఐసిసి (ICC) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీసీఐ ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్‌లకు అనూహ్యంగా చోటు దక్కగా.. స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు అవకాశం లభించలేదు. ఐపీఎల్‌ 2021లో (IPL 2021) సత్తా చాటడం సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్‌లకు కలిసొచ్చే అంశమైంది.  


టీమిండియా పేసర్ల జాబితాలో జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah), మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు చోటు లభించింది. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించనుండటం విశేషం. 


Team india squad for T20 world cup: భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టేన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టేన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ భారత్ జట్టులో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. 


బీసీసీఐ (BCCI) చేసిన ఈ ప్రకటన ఒక రకంగా శిఖర్ ధావన్‌లో నిరాశకు గురిచేసింది. టీ20 వరల్డ్ కప్ జట్టులో కేఎఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల (Shikhar Dhawan) మధ్యే పోటీ ఉంటుందని పలువురు సీనియర్ క్రికెటర్స్ అభిప్రాయపడిన విధంగానే ఈ జట్టులో రాహుల్‌కి ఛాన్స్ దక్కింది.