T20 World Cup 2021: టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదు: సెహ్వాగ్
పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని తెలిపాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత్ కంటే పాకిస్థాన్ మెరుగ్గా కనిపిస్తుందని వెల్లడించాడు.
T20 World Cup 2021: పాకిస్థాన్ జట్టులా టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదని మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు. ‘'ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నాం'’ అని పాకిస్థాన్(Pakistan)కి చెందిన ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్(Virender Sehwag) ఘాటుగా బదులిచ్చాడు.
‘ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్(Pakistan) కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటంతో.. 2003, 2011 ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగాం. మేమెప్పుడూ సానుకూల వైఖరితోనే ఆడతాం. (‘ఈ సారి మేం చరిత్ర సృస్టించబోతున్నాం’ అన్న యాంకర్ మాటలను ఉద్దేశించి) అంతేకాని పాకిస్థాన్‌లా గొప్పలు చెబుతూ కూర్చోం. టీమిండియా(teamindia) ఎప్పుడూ అలాంటి ప్రకటనలు చేయదు. మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా సంసిద్ధమైతే ఫలితాలు అవే వస్తాయి.
Also read: T20 World Cup Records: టీ20 ప్రపంచకప్ ప్రత్యేకతలు, రికార్డుల వివరాలు ఇలా
కానీ, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే.. టీ20(T20 World Cup 2021)ల్లో పాకిస్థాన్ మెరుగ్గా కనిపిస్తోంది. అందుకే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇది 50 ఓవర్ల మ్యాచ్ కాదు.. పొట్టి క్రికెట్లో ఒక్క ఆటగాడు రాణించినా మ్యాచ్ ఫలితాలు తారుమారు అయిపోతాయి. అయితే, పాకిస్థాన్ ఇప్పటివరకు అలా చేయలేకపోయింది. చూద్దాం.! అక్టోబరు 24న ఏం జరుగుతుందో’ అని వీరేందర్ సెహ్వాగ్(Virender Sehwag) పేర్కొన్నాడు.
2007లో టీ20 ప్రపంచకప్(T20 World Cup) ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్-పాక్ జట్లు 5 సార్లు తలపడితే.. ఐదు సార్లు టీమిండియా(India)నే విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఏడు సార్లు పోటీపడగా.. అన్నిసార్లు భారత జట్టే విజేతగా నిలిచింది. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 12-0తో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook