Shoaib Akhtar Comments: ఫస్ట్ టీమిండియా.. తర్వాత న్యూజిలాండ్... అస్సలు వదలొద్దు! (వీడియో)
మొదట న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తరువాత ఇంగ్లండ్ క్రికెట్ జట్లు పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకున్న కారణంగా పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా మండిపడ్డారు.. వీడియో పోస్ట్ చేస్తూ.. ఏమన్నారంటే..??
Shoaib Akhtar About T20 World Cup: పాకిస్తాన్ క్రికెట్ టీం (Pakistan Cricket Team) మరియు యాజమాన్యం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. 8 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లో పర్యటనను అంగీకరించి, చివరి నిమిషంలో న్యూజిలాండ్ టూర్ (New Zealand- Pakistan Tour) రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే..
అయితే ఆటగాళ్ల భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని టూర్ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (New Zealand Cricket Board) వెల్లడించింది. అయితే అక్టోబర్ నెలలో ఇంగ్లండ్ (England) మహిళల మరియు పురుషుల జట్లు పాకిస్థాన్ (Pakistan) లో పర్యటించాల్సి ఉంది. కానీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు లాగానే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket Board) కూడా ఈ రెండు టూర్ లను రద్దు చేసుకుతున్నట్టు వెల్లడించింది.
Also Read: Memes on Raj Kundra Bail: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా మీమ్స్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు
ఇలా అన్ని విదేశీ బోర్డులు పాకిస్థాన్ పర్యటనలను చివరి నిమిషంలో రద్దు చేసుకోవటంపై షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) సహా పలు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది వరకే చాలా సార్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై విమర్శించిన షోయబ్ అక్తర్.. ఇంగ్లండ్-పాకిస్థాన్ టూర్ (England- Pakistan Tour) రద్దు ప్రకటనపై మరోసారి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై తీవ్రంగా మండిపడ్డాడు. మొదట న్యూజిలాండ్ తమ టూర్ ను రద్దు చేసుకోవటం కారణంగా మిగతా విదేశీ క్రికెట్ బోర్డులన్నీ అదే బాటలో వెళ్తున్నాయని అసహనం వ్యక్తం చేసాడు.
"మొదట న్యూజిలాండ్ తిరస్కరించింది.. ఇపుడు ఇంగ్లండ్ కూడా మన దేశంలో పర్యటనను రద్దు చేసుకుంది. మరేం పర్లేదు... టీ20 వరల్డ్‌కప్‌లో (T 20 World Cup) చూసుకుందాం... ముఖ్యంగా న్యూజిలాండ్ ను వదలొద్దు... వారిని ఆటలో మట్టి కరిపించి మన సత్తా తెలిపాలి" అని షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ లో అక్తర్ మాట్లాడారు. అంతేకాకుండా... తమని. తమ దేశాన్ని, తమ ఆటను తిరస్కరణతో కించపరచిన జట్లపై వరల్డ్‌కప్ ఈవెంట్‌లో పైచేయి సాధించి బుద్ది చెప్పాలని.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు (Pakistan Captain Babar Azam) షోయబ్ అక్తర్ సూచించాడు.
"వరల్డ్ కప్ ఈవెంట్ లో మొదటగా భారత్ తో మన మ్యాచ్.. తరువాత అక్టోబరు 26న న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మనకు చాలా ముఖ్యం, అవమానించన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు మనం బుద్ది చెప్పి తీరాలి...." అని షోయబ్ అక్తర్ తెలుపగా..
"కానీ దీనికంటే ముందు వరల్డ్ కప్ (PCB) జట్టు ఎంపిక విషయంలో చాలా మార్పులు చేయాల్సి ఉంది, జట్టు ఎంత బలంగా ఉంటే అంత బాగా ఆట తీరును కనబరచవచ్చు..ఇలాంటి కష్ట సమయాల్లో మనల్ని మనం ప్రపంచానికి గెలుపు ద్వారానే తెలుపగలం అని" పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (Pakistan Cricket Board) షోయబ్ అక్తర్ పలు సూచనలు తెలిపాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook