చిన్న పిల్లాడు కూడా నాటౌట్ అని చెప్తాడు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ తీసుకున్న బంగ్లా కెప్టెన్!
Worst DRS review for LBW ever by Bangladesh Cricket. ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఎవరూ ఊహించని రీతిలో రివ్యూ తీసుకున్నాడు.
Bangladesh captain Tamim Iqbal takes bizarre review: మిర్పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఎవరూ ఊహించని రీతిలో రివ్యూ తీసుకున్నాడు. స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా.. రివ్యూ తీసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. క్రికెట్ తెలిసిన చిన్న పిల్లాడు కూడా రివ్యూ తీసుకొని సందర్భంలో ఓ అంతర్జాతీయ కెప్టెన్ తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చేర్చగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే... రెండవ వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ 48వ ఓవర్ బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్‌లో తస్కిన్ వేసిన యార్కర్‌ను ఇంగ్లీస్గ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఎదుర్కొన్నాడు. బంతి రషీద్ ప్యాడ్‌కు దూరంగా వెళ్లి బ్యాట్ అంచున తాకింది. బౌలర్ తస్కిన్ అహ్మద్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ డీఆర్‌ఎస్ కోరాడు. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సాయం కోరాడు.
రిప్లేలో బంతి ఎక్కడా ఆదిల్ రషీద్ ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించలేదు. అంతేకాదు బంతి ప్యాడ్లకు చాలా దూరంగా వెళుతున్నట్లు తేలింది. దీంతో అంపైర్ ఆదిల్ రషీద్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్.. బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యానికి గురవుతున్నారు. 'క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ', 'చిన్న పిల్లాడు కూడా నాటౌట్ అని చెప్పేస్తాడు', 'అంతర్జాతీయ కెప్టెన్ ఇలాంటి రివ్యూ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచులో ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (132) సెంచరీ చేయగా.. జొస్ బట్లర్ (76) హాఫ్ సెంచరీ బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ (58) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్ చెరో నాలుగు వికెట్లు తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.