ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో పతంజలి (Patanjali ) ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు స్పాన్సర్ షిప్ కోసం సాగుతున్న పోటీల్లో టాటా సన్స్ ( Tata Sons ) కూడా ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ ఊహించని రీతిలో టాటా సన్స్ బిడ్ వేసినట్టు తెలుస్తోంది. ఇక స్పాన్సర్ షిప్ కోసం వివో ప్రతి ఏడాది రూ.440 కోట్లు 2020 వరకు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకుంది. అయితే భారత్-చైనా ( India-China Conflicts ) మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య వివో ఈ ఒప్పంద నుంచి ముందే తప్పుకుంది. దీంతో కొత్త  స్పాన్సర్ల కోసం వెతకడం ప్రాంభించింది బీసీసీఐ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ఈ సారి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్  2020 ( Indian Premier League 2020 ) స్పాన్సర్ షిప్  డీల్ కేవలం నాలుగున్నర నెలల పాటు మాత్రం ఉంటుంది అని బీసీసీఐ ( BCCI ) తెలిపింది. బిడ్ వేసే కంపెనీలకు కనీస టర్నోవర్ రూ.300 కోట్లు ఉండాలి అని తెలిపింది. అయితే బిడ్స్ వేసిన వారిలో ఎవరికి  స్పాన్సర్ షిప్ వరిస్తుందో అనేది ఆగస్టు 18న ప్రకటించనున్నారు. ప్రస్తుతం పతంజలితో పాటు, అమెజాన్, బైజూస్, డ్రీమ్11, రిలయ్స్ జియో సంస్థలు పోటీలో ఉన్నాయి. Sonu Sood: ముంబైకి 5,500 తో వచ్చాను