SRH vs MI Live: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సరికొత్త చరిత్ర సృష్టించి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 31 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్‌, తిలక్‌ వర్మల అద్భుత బ్యాటింగ్‌తో సొంత మైదానంలో సన్‌ రైజర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. హోరాహోరీగా కొనసాగిన మ్యాచ్‌ తెలుగు ప్రజలకే కాదు యావత్‌ క్రికెట్‌ప్రియులను పసందైన వినోదాన్ని అందించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RCB Vs PBKS: విరాట్‌ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి తొలి విజయం.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌ ఓటమి


 


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు సన్‌రైజర్స్‌ ఊచకోత కోసింది. బ్యాటర్లు పరుగుల వరద పారించారు. హైదరాబాద్‌లో స్కోర్ల సముద్రాన్ని సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. హెన్రిక్‌ క్లాసెన్‌ పరుగుల బీభత్సం సృష్టించాడు. 34 బంతుల్లో 80: 4 ఫోర్లు, 7 సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. మొదట ఓపెనర్‌గా దిగిన మయాంక్‌ అగర్వాల్‌ (11) తక్కువ స్కోర్‌కే మైదానం వీడిన సమయంలో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ పరుగుల వరద పారించారు. చెలరేగి ఆడిన అభిషేక్‌ శర్మ 63 (2౩ బంతుల్లో ౩ ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేశాడు. ట్రావిస్‌ హెడ్‌ 62 (24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అదే స్థాయిలో ఆట ఆడి భారీగా పరుగులు తీశాడు.

వారిద్దరి మాదిరిగా మార్కరమ్‌ ధాటిగా ఆడి 42 స్కోర్‌ చేశాడు. మైదానంలోకి వచ్చిన వాళ్లు వచ్చినట్టు బ్యాట్‌తో చెలరేగిపోయారు. 20 ఓవర్లు కూడా పవర్‌ ప్లే మాదిరి రెచ్చిపోయి ఆడారు. ఇక హైదరాబాద్‌ బ్యాటర్లను ముంబై బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. క్వెనా మఫకా నాలుగు ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకోగా.. గెరాల్డ్‌ కాటెజ్‌ 57, హార్దిక్‌ పాండ్యా 46 పరుగులు ఇచ్చారు. కెప్టెన్‌ పాండ్యా, కాటేజ్‌, పీయూష్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.

Also Read: CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం


 


లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌.. కొండంత లక్ష్యం ఉన్నా ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ ఏమాత్రం భయపడలేదు. లక్ష్యం ఛేదించడానికి శక్తియుక్తినంతా ఉపయోగించి విజయం కోసం ముంబై ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. తెలంగాణ ఆటగాడు తిలక్‌ వర్మ సొంత మైదానంలో రెచ్చిపోయి ఆడాడు. 34 బంతుల్లో 64 పరుగులు చేసి సత్తా చాటాడు. 2 ఫోర్లు, 6 సిక్సర్లలో చెలరేగి ఆడాడు. ఓపెనర్లుగా దిగిన మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (34)తోపాటు నమన్‌ ధీర్‌ (౩౦) మంచి స్కోర్‌ సాధించారు. టిమ్‌ డేవిడ్‌ (42), రొమారియో షెఫర్డ్ (15) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడ్డారు. లక్ష్యాన్ని చూడకుండా విజయం కోసం కష్టపడ్డారు.


ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు ఇవే..


  • 277/3- సన్‌రైజర్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌, హైదరాబాద్‌-2024

  • 263/5- ఆర్సీబీ వర్సెస్‌ పుణె, బెంగళూరు-2013

  • 257/5 ఎల్‌ఎస్‌జీ వర్సెస్‌ పీబీకేఎస్‌, మొహలీ-

  • 248/3 ఆర్‌సీబీ వర్సెస్‌ జీఎల్‌, బెంగళూరు-2016

  • 246/5 సీఎస్‌కే వర్సెస్‌ ఆర్‌ఆర్‌, చెన్నై-2016



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook