విశాఖ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ పదివేల పరుగులు మార్క్ను దాటేశాడు.విండీస్ తో జరగుతున్న రెండో వన్డేలో కోహ్లీ 81 పరుగలు పూర్తి చేసుకోగానే ఈ ఘనతను సాధించినట్లయింది. కాగా మొత్తం 205 ఇన్నింగ్స్ ల్లోనే పది వేల పరుగుల మార్క్ ను కోహ్లీ అధిగమించాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సచిన్ 263 ఇన్నింగ్స్ లో పదివేల పరుగులు నాడు పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 10 వేల పరుగుల క్లబ్ లో ప్రపంచ క్రికెట్ లో 13 మంది ఉండగా...భారత్ తరఫున ముగ్గురు ఉన్నారు.  భారత్ తరఫున10 వేల మార్క్ దాటిన వారిలో సచిన్ టెండూల్కర్ తో పాటు గంగూలీ, ద్రవిడ్, ధోనీ ఉన్నారు. తాజాగా కోహ్లీ ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా  విశాఖ వేదికగా ఈ రికార్డును  బద్దలు కొట్టడం పట్ల కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


ప్రపంచ వన్డే క్రికెట్ లో 10వేల పరుగులు మార్క్ దాటిన క్రికెటర్ల జాబితా : 


సచిన్ టెండూల్కర్ - 18426 పరుగులు


కుమార సంగక్కర - 14234 పరుగులు


రికీ పాంటింగ్ - 13704 పరుగులు


సనత్ జయసూర్య - 13430 పరుగులు


మహేల జయవర్ధనే - 12650 పరుగులు


ఇంజామా-ఉల్-హక్ - 11739


జాక్విస్ కల్లిస్ - 11579


సౌరవ్ గంగూలీ - 11363 పరుగులు


రాహుల్ ద్రావిడ్ - 10889


బ్రియాన్ లారా - 10405 పరుగులు


తిలకరత్నే దిల్షాన్ - 10290 పరుగులు


ధోనీ - 10139 * పరుగులు


విరాట్ కోహ్లి - 10000 * పరుగులు