కోహ్లీ-రోహిత్‌ ల మధ్య విభేదాలపై తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై టీమిండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ స్పందించాడు. విండీస్ టూర్ కు బయల్దేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంలో రోహిత్ శర్మ వివాదంపై మీడియా ప్రశ్నించగా.. తమ మధ్య అలాంటి వివాదాలు ఏమీ లేవన్ని సమాధానం ఇచ్చాడు. వాస్తవానికి తాను రోహిత్ శర్మ ఆటకు అభిమానిని కోహ్లీ ఉద్ఘాటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది వివాదాల సమయం కాదు..
ఇది క్రికెట్ పై  దృష్టిపెట్టాల్సిన సారించాల్సిన సమయమని...పర్యటనలో గెలుపు గురించి తప్పితే మరో ఆలోచన తనకు లేదన్నాడు. ఇలాంటి సమయంలో లేని వివాదాన్ని రేకెత్తిస్తున్నారన్నారని మీడియాపై మండిపడ్డారు. కథనాలు ప్రసారం చేసే సమయంలో వాస్తవాలను తెలుసుకోవాలని  మీడియాకు చురకలు అంటించాడు.


 



వివాదం బయటపడిందిలా..?
వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియాలో వివాదాలు బయటపడ్డాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.  కెప్టెన్ విరాట్ కోహ్లీతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అస్సలు పొసగడంలేదంటూ ప్రచారం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు... కోహ్లీ, అనుష్క శర్మలను ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ శర్మ అన్ ఫాలో చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే  రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేయడం గమనార్హం. మరి ఈ విషయంలో రోహిత్ ఎలా స్పందింస్తారనేది చూడాల్సి ఉంది.