Sunil Gavaskar feels Rohit Sharma and Virat Kohli may consider retiring: టీ20 ప్రపంచకప్ 2022 నుంచి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై మూల్యం చెల్లించుకుంది. మరోసారి పొట్టి టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజేతులారా చేజార్చుకుంది. పేలవ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ముందు తలొంచాక తప్పలేదు. టైటిల్ తెస్తుందనుకున్న భారత్.. ఉట్టి చేతులతోనే స్వదేశానికి తిరుగు పయనమవ్వడం భారత అభిమానులను కలిచివేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022లో నిష్క్రమణ నేపథ్యంలో భారత జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లలో కొంతమంది కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చే ఆస్కారం ఉందని క్రికెట్ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కెప్టెన్ రోహిత్‌ శర్మ స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భారత జట్టు కెప్టెన్సీ చేపట్టే ఆస్కారం ఉందని కూడా అన్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, దినేష్ కార్తీక్, మొహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ ప్లేయర్స్ టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన విషయం తెలిసిందే. 


భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ టీ20 ప్రపంచకప్‌ 2022 బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ... 'న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టు భిన్నమైంది. హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలో జట్టు అక్కడికి వెళుతోంది. హార్దిక్ జట్టుపై తన ముద్ర వేయడం ప్రారంబిస్తాడు. అతను ఐపీఎల్ టైటిల్ గెలిచాడు కాబట్టి సెలక్షన్ కమిటీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. పాండ్యాఫై నమ్మకం ఉంచారు. ఇక నిరూపించుకోవాల్సిన బాధ్యత అతడిదే. అతడు సక్సెస్ అయితే త్వరలోనే భారత జట్టు కెప్టెన్సీ చేపట్టే ఆస్కారం ఉంది' అని అన్నారు. 


'భారత జట్టులో ఇప్పుడు కొంతమంది ఆటగాళ్లు రిటైర్మెంట్‌ తీసుకోవచ్చు. రిటైర్మెంట్‌ గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు. కానీ జట్టులో 30 ఏళ్లకు పైబడిన వారు చాలా మంది ఉన్నారు. ఆటగాళ్లు దీని గురించి ఎంతో ఆలోచిస్తారు. ఏమో కొందరు ప్లేయర్స్ రిటైర్మెంట్‌ తీసుకోవచ్చు' అని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. రోహిత్‌, అశ్విన్‌, కార్తీక్‌, కోహ్లీ, షమీ, భువీలు 30 ఏళ్ల వయసు దాటారు. 


Also Read: PAK Vs ENG Final: పసికూనల చేతిలో చావు దెబ్బతిని.. కసి తీర్చుకున్న పాక్, ఇంగ్లాండ్   


Also Read: Aadhar Update: ఆధార్‌లో కొత్త మార్పులు.. తప్పక తెలుసుకోండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook