India ranked No. 1 in all three formats: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా... తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు తొలిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనుక్కినెట్టి ఈ ర్యాంక్ ను దక్కించుకుంది భారత్. రెండు జట్ల మధ్య తేడా నాలుగు పాయింట్లే. 115 రేటింగ్‌ పాయింట్లతో మెుదటి స్థానంలో రోహిత్ సేన కొనసాగుతుండగా. 111 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో, 100 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, 85 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు టెస్టులతోపాటు మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచిన టీమ్ గా రికార్డు సృష్టించింది. ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇద్దరి మధ్య 21 పాయింట్లు తేడా ఉంది. నాగ్ పూర్ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన జడేజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 16 ర్యాంకుకు వెళ్లాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలోనూ,  అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలోనూ కొనసాగుతున్నారు. టీమిండియా, ఆసీస్ మధ్య రెండో టెస్టు ఢిల్లీ వేదికగా ఈనెల 17 నుంచి ప్రారంభంకానుంది. 


Also Read: IND Vs AUS 2nd Test: 36 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు.. కంగారూల వెన్నులో వణుకు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook