ఆ ప్లేయర్ భారత జట్టుకు భారమయ్యాడా?.. రిటైర్మెంట్ ఇవ్వక తప్పదా!
Ishant Sharma`s Crikcet career On The Verge Of Ending. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఇషాంత్ శర్మ.
Team India fast bowler Ishant Sharma's Crikcet career On The Verge Of Ending: భారత క్రికెట్ జట్టులోని ఓ వెటరన్ ప్లేయర్ క్రికెట్ కెరీర్ దాదాపుగా ముగిసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అరకొర అవకాశాలు అందుకుంటున్న అతడు.. జూలైలో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదవ టెస్టు మ్యాచ్‌కి ఎంపిక కాలేదు. అంతకుముందే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చోటు కోల్పోయిన ఆ వెటరన్ ఆటగాడు.. తాజాగా టెస్టులో కూడా స్థానం సంపాదించలేకపోయారు. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఇషాంత్ శర్మ.
గతేడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చివరి టెస్ట్ జరగలేదు. భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టును భారత్ గెలిచినా లేదా డ్రా చేసుకున్నా సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. ఐదవ టెస్ట్ మ్యాచ్ జూలై 1 నుంచి 5 వరకు జరుగుతుంది. ఇందుకోసం బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ప్రకటించగా.. అందులో ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు.
టీమిండియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు మళ్లీ భారత క్రికెట్ జట్టులో అవకాశం రావడం కష్టమే అని చెప్పొచ్చు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్ల త్రయం భారత జట్టుకు అందుబాటులో ఉంది. నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఫేవరెట్‌గా ఉన్నారు. వెటరన్ పేసర్ భునవేశ్వర్ కుమార్, యార్కర్ కింగ్ టీ నటరాజన్, పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అందుబాటులో ఉన్నారు. అందుకే ఇషాంత్ శర్మకు మళ్లీ టీమిండియాలో అవకాశం దక్కడం దాదాపుగా అసాధ్యమే. ఇక రిటైర్మెంట్ ఇవ్వక తప్పదు అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఇషాంత్ శర్మ నవంబర్ 2021లో భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇషాంత్ చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో ఆడాడు. ఇషాంత్ భారత్ తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. ఇషాంత్ తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను మే 2021లో ఆడాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 93 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 72 వికెట్లు తీశాడు.
Also Read: Ameya Mathew Pics: అమేయ మాథ్యూ.. ఆ అందమే వేరబ్బా! కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా
Also Read: Nazriya Nazim Pics: గ్లామర్ డోస్ పెంచేసిన నజ్రియా నజీమ్.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook