IND vs NZ: విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా! తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్
India Slapped With 60 PerCent Fine for Slow Over-rate in Uppal ODI. తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది.
India Fined 60 PerCent Of Match Fee For Slow Over Rate In IND vs NZ 1st ODI: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ (208; 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు)తో చెలరేగడంతో భారత్ విజయాన్ని అందుకుంది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ సేన 1-0తో శుభారంభం చేసింది. తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది.
మొదటి వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయం కన్నా మూడు ఓవర్లు తక్కువ వేసినందుకు.. మ్యాచ్ ఫీజులో 60 శాతం (ఓవర్‌కు 20 శాతం చొప్పున) కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్ స్లో ఓవర్ రేట్ అభియోగాలు నమోదు చేశారు. దాంతో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ విచారణ చేపట్టి.. మ్యాచ్ ఫీజులో కొత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ తప్పిదాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.22 ప్రకారం.. మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసేలోగా టీమిండియా 3 ఓవర్లు తక్కువ వేసినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జగవల్ శ్రీనాథ్ తెలిపారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించినట్లు, విచారణ అవసరం లేదని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.
రాయ్‌పూర్ వేదికగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే.. సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని చూస్తోంది.దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
Also Read: DRC Boat Accident: డీఆర్‌సీలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.