MS Dhoni as Gangster Pics got Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం కూడా తగ్గలేదు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహీ. ఈ సీజన్‌లో చెన్నైను విజేతగా నిలిపి.. ఐదో టైటిల్‌ను అందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధోని ఆటతీరుతోనే కాదు.. తన మాటతీరుతో ప్రత్యర్థుల మనసులు సైతం గెలుచుకున్నాడు. ధోనిని క్రికెటర్‌గా, అద్భుతమైన భర్తగా, తండ్రిగా చూశాం. అయితే మల్టీవర్స్ భావన నిజమైతే..? ఎంఎస్ ధోని ఒక భయంకరమైన ఇండియన్ ఆర్మీ సైనికుడు లేదా వ్యోమగామి వంటి వివిధ పాత్రలలో ఎలా ఉంటాడు..?  మల్టీవర్స్‌ ధోనిని విజువలైజ్ చేయడానికి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఓ ఏఐ ఆర్టిస్ట్ ధోని వివిధ రూపాల్లో ఉంటే ఎలా ఉంటాడో విజులలైజ్ చేశాడు.


ఎంఎస్ ధోనిని మల్టీవర్స్‌లో వివిధ రూపాల్లో డిజైన్ చేశాడు. ఏఐ ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఒక పిక్‌లో మహిని విజయవంతమైన మల్టీ బిలియనీర్‌గా చిత్రీకరించాడు. మరో పిక్‌లో ఒక మిషన్‌లో ఇండియన్ ఆర్మీ సైనికుడిగా డిజైన్ చేశాడు. గ్యాంగ్‌స్టర్‌గా ధోనిని ఏఐ మార్చేసింది. ధోని శరీరం అంతా టాటూలతో నిండిపోయింది. శాంతియుత సన్యాసిగానూ ధోనిని ఏఐ చూపించింది. ఏఐ రూపొందించిన ఇతర చిత్రాలలో మధ్యయుగ సైనికుడిగా, వ్యోమగామిగా, చెఫ్‌గా, బాక్సర్‌గా, కౌబాయ్‌గా, వివిధ విశ్వాలలో భయంకరమైన అనాగరికుడిగా కూడా చూడవచ్చు.


Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?



ఈ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో @wild.trance అనే పేజీ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏఐ ఆర్టిస్ట్ ఊహపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. “వావ్... అమేజింగ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అద్భుతంగా డిజైన్ చేశారంటూ మెచ్చుకుంటున్నారు. విక్కీ కౌశల్, ఎంఎస్ ధోనిల కలయికగా అనిపిస్తుందని అంటున్నారు. "ది మ్యాన్ ది మిత్ ది లెజెండ్ ది ఫినిషర్ ది గేమ్ ఛేంజర్ ది కెప్టెన్ కూల్&మరెన్నో.. ది వన్ & ఓన్లీ మహి" అని ధోని అభిమాని వ్యాఖ్యానించారు.


Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook