Bhuvneshwar Kumar: భువనేశ్వర్ విఫలం కావడానికి అదే కారణం..సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు..!
Bhuvneshwar Kumar: టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను పలు సమస్యలు ఉంటాడుతున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం కలవర పెడుతోంది. ఈనేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Bhuvneshwar Kumar: స్వదేశంలో టీమిండియా మరో సిరీస్‌ను దక్కించుకుంది. ఐతే పలు లోపాలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా..బౌలింగ్‌లో మాత్రం తేలిపోతోంది. కీలక ఓవర్లలో ధారళంగా పరుగులు ఇస్తున్నారు. మరి ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్ దారుణంగా ఉంది. 18, 19, 20 ఓవర్లలో 40 నుంచి 50 పరుగులను సమర్పించుకుంటున్నారు.
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆది నుంచే దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. ఆసియా కప్ నుంచి ఇప్పటివరకు డాట్ బాల్స్ వేయడం గగనంగా మారుతోంది. ప్రధానంగా డెత్ఓవర్లలో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. 18, 19, 20 ఓవర్లలో 14 నుంచి 16 పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లోనూ ఇదే జరిగింది.
త్వరలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈక్రమంలో అతడి ఫామ్ ఆందోళన కల్గిస్తోంది. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈఏడాది భువీ అత్యధిక మ్యాచ్‌లు ఆడాడని..అందుకే అలసట కారణంగా ఫామ్ తగ్గిందన్నాడు. దీని కారణంగానే అతడి లయ తప్పిందన్నాడు. ఈఏడాది ఆసీస్ సిరీస్‌లో ఓ మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లు ఆడాడని గుర్తు చేశాడు. అతడిని తాను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నానని..పనిభారాన్ని ఎక్కువ తీసుకునే వ్యక్తి కాదన్నాడు.
ఒకటిరెండు ఫార్మాట్లే ఆడతాడని..కాస్త విరామం తర్వాత రెచ్చిపోతాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. అందుకే భువీ ఫామ్ కోల్పోవడానికి అలసటే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. అందుకే టీమిండియా జట్టు మూడో పేసర్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. హర్షల్ పటేల్ ఉన్నప్పటికీ..అతడు సైతం దారుణంగా పరుగులు ఇస్తున్నాడన్నాడు. అందుకే సీమ్ బౌలర్‌గా అతడికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పాడు. ఈసమయంలో షమీని జట్టులోకి తీసుకోవడం మంచిదన్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.
[[{"fid":"246586","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:CM Jagan: పశువులన్నింటికీ బీమా సదుపాయం..సీఎం జగన్ సరికొత్త నిర్ణయం..!
Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో వరుణ ప్రతాపం..లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి