India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే సిరీస్ తొలి మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. పేస్ బౌలింగ్, ఓపెనింగ్ అదరగొట్టడంతో..ఇండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు వన్డేలో సిరీస్ కోసం జింబాబ్వేలో టీమ్ ఇండియా పర్యటన శుభంగా ప్రారంభమైంది. ఇవాళ జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆతిధ్య జింబాబ్వే జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 


భారత పేస్ బౌలర్లు, ఓపెనర్లు అదరగొట్టే ప్రదర్శన ఇవ్వడంతో ఇండియా శుభారంభం చేసింది. టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది జింబాబ్వే. 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలవుట్ అయింది. కెప్టెన్ చకాబ్వా ఒక్కడే 35 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. టీమ్ ఇండియా బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర పటేల్‌లు మూడేసి వికెట్లు తీయడం గమనార్హం. మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.


189 పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన టీమ్ ఇండియా  వికెట్ నష్టపోకుండా విజయాన్ని కైవసం చేసుకుంది. 189 పరుగుల్ని కేవలం 30.5 ఓవర్లలోనే సాధించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ 113 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, శుభ్‌మన్ గిల్ 71 బంతుల్లో 82 పరుగులతో ధాటిగా ఆడాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలోనే టీమ్ ఇండియా బౌలర్ దీపక్ చహర్ టాప్ 3 వికెట్లు పడగొట్టాడు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగకుండా శుభమన్ గిల్-ధావన్‌లను పంపించిన ప్రయోగం సక్సెస్ అయింది. 


Also read: IND vs ZIM: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అనుకోని ఘటన..ఇషాన్‌ కిషన్‌పై తేనేటీగల దాడి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook