Who is Next India Coach: టీమిండియా నెక్ట్స్‌ కోచ్ ఎవరు..? ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌ తరువాత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ఆ తరువాత ద్రావిడ్ తప్పుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ వరల్డ్ కప్ గెలవకపోతే కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు రాహుల్ ద్రావిడ్‌పై కూడా వేటు పడే అవకాశాలు ఉంటాయి. నవంబర్‌లో జరిగే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది. ద్రావిడ్ స్థానంలో నలుగురు మాజీలు కోచ్ పదవి రేసులో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆశిష్ నెహ్రా 


టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. నెహ్రా కోచింగ్‌లో గుజరాత్ బౌలింగ్ విభాగం ఎంత పటిష్టంగా ఉందో తెలిసిందే. గతేడాది ఛాంపియన్‌గా నిలవగా.. ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కోచ్ పోస్టుకు నెహ్రా బలమైన పోటీదారుగా మారే అవకాశం ఉంది. అప్పటికీ హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎన్నికైతే.. నెహ్రాను కోచ్‌గా ఎంపిక అయ్యేందుకు లైన్ క్లియర్ అయినట్లే..


వీరేంద్ర సెహ్వాగ్


మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియా కోచ్ పదవిపై ఆసక్తిగా ఉన్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో బౌలర్లను బెంబేలెత్తించిన వీరూ.. కోచింగ్‌లోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. సెహ్వాగ్ కోచ్‌గా ఎంపికైతే.. టీమిండియా జట్టు నిర్ణయాల్లో కూడా దూకుడుగా ఉంటుంది. ఇంగ్లాండ్‌కు బ్రెండన్ మెక్‌కల్లమ్ తరహాలో కోచింగ్ ఇచ్చిన తరహాలోనే సెహ్వాగ్ కూడా భారత్‌కు కూడా సరికొత్త శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. గతంలోనే వీరేంద్ర సెహ్వాగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.


స్టీఫెన్ ఫ్లెమింగ్ 


టీమిండియాకు విదేశీ కోచ్ కావాలని అనుకుంటే.. న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అతిపెద్ద పోటీదారుగా ఉంటాడు. ప్రపంచ క్రికెట్‌లో స్టీఫెన్ ఫ్లెమింగ్ చాలా విజయవంతమైన కోచ్‌గా ఉన్నాడు. ఫ్లెమింగ్ కోచింగ్‌లో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు 2010, 2011, 2018, 2021, 2023 ట్రోఫీలను గెలుచుకుంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలివైన వ్యూహకర్త. టీమిండియా ప్లేయర్లతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. పెద్ద టోర్నీలను ఎలా గెలవాలో స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు బాగా తెలుసు. టీమిండియా కోచ్ పదవిపై ఫ్లెమింగ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 


టామ్ మూడీ


ఆస్ట్రేలియా మాజీ కోచ్ టామ్ మూడీ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సేవలు అందిస్తున్నాడు. టామ్ మూడీ కోచింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకసారి ఐపీఎల్ ట్రోఫిని సొంతం చేసుకుంది. 2017లో టీమిండియా కోచ్ పదవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు టామ్. కోచ్ ఎంపిక ప్రక్రియలో చివరి వరకు రవిశాస్త్రికి గట్టి పోటీగా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ రవిశాస్త్రికి సపోర్ట్ చేయడంతో.. టామ్ మూడీకి నిరాశ తప్పలేదు. మరోసారి టామ్ మూడీ టీమిండియా కోచ్ పదవికి బలమైన పోటీదారుగా ఉంటాడు. 


Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు  


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook