ICC Men's T20 World Cup 2024 Ambassador: జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఈ జట్లన్నీ మే 01లోగా ప్రపంచకప్‌కు తమ టీమ్స్ ను ప్రకటించాల్సి ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024కి బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను నియమించింది ఐసీసీ. యువీతోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహారించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఐసీసీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా దీనిపై యువరాజ్ సింగ్(Yuvraj Singh) స్పందించాడు. 'ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడంతో సహా T20 ప్రపంచ కప్‌కు సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ లో భాగం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది'' అంటూ యూవీ అన్నాడు. తొలి టీ20 ప్రపంచకప్ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగంది. ఈ మెగా టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 


రాబోయే వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. మన జట్టుతోపాటు ఇదే గ్రూపులో అమెరికా, కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. లీగ్ రౌండ్‌లో ఒక్కో జట్టు 4 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 05న ఐర్లాండ్ తో ఆడబోతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జూన్ 09న తలపడనుంది.ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్టును బీసీసీఐ ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. 


Also Read: Krunal Pandya: మరోసారి తండ్రైన‌ కృనాల్ పాండ్యా.. బాబు పేరేంటో తెలుసా?


Also Read: T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాను కలవరపెడుతున్న ఆ ఇద్దరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter