Mohammad Shami: టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కన్పించింది. మొహమ్మద్ షమీ..వేసిన బౌల్ ఎట్నుంచి వచ్చిందో అర్ధమయ్యేలోగా వికెట్ తీసేసింది.  ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులో టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక రెండవ టెస్ట్ మ్యాచ్ బౌలర్లు సత్తా చాటేందుకు వేదికగా నిలిచింది. పింక్ బాల్ టెస్ట్ తొలిరోజు ఇండియన్ బ్యాటర్లు 252 పరుగులకే ఆలవుట్ అయింది. అటు శ్రీలంక కూడా తొలిరోజు ఆట ముగిసేసరికి 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అంటే ఒక్కరోజులోనే ఇండియా-శ్రీలంక బౌలర్లు కలిసి 16 వికెట్లు పడగొట్టారు. బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆట ఇది. 


ఇదిలా ఉంటే టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ షమీ వేసిన ఒక బాల్ అద్భుతమై నిలిచింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి వికెట్ పోగొట్టుకునేలా చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నేను తన అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు మొహమ్మద్ షమీ. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో మొహమ్మద్ షమీ వేసిన బంతిని కరుణరత్నే ఇంకా ఆడనే లేదు. బంతి ఎలా వస్తుందనేది అంచనా వేస్తున్నాడు.ఈలోగా ఆఫ్‌స్టంప్ వెలుపల పడిన బంతిని ఒక్కసారిగా తిరిగి..నేరుగా వికెట్లపైకి వచ్చేసింది. అంతే కేవలం 4 పరుగులకే వెనుదిరిగిపోయాడు. బ్యాట్స్‌మెన్ బంతిని పూర్తిగా అంచనా వేసేలోగా వికెట్ ఎగురేసుకువెళ్లిపోయింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


టీమ్ ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా చెలరేగి బౌల్ చేశాడు. మూడు వికెట్లు తీశాడు. మొహమ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. టీమ్ ఇండియా తరపున శ్రేయస్ అయ్యర్ 92 పరుగులు, శ్రీలంక తరపున మాధ్యూస్ ఒక్కడే 43 పరుగులు చేయగలిగాడు. మొత్తానికి  బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కన్పించిన తొలిరోజు ఆటలో..మొహమ్మద్ షమీ వేసి ఆ బాల్ మాత్రం వైరల్ అవుతోంది. 


Also read: India vs Srilanka: బెంగళూరు టెస్ట్‌లో సరికొత్త రికార్డు, ఏకంగా 16 వికెట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి