IND Vs WI: రేపటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ట్రిన్ డాడ్ వేదికగా రాత్రి 8 గంటలకు తొలి టీ20 జరుగుతుంది. ఈనేపథ్యంలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 సిరీస్‌కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విండీస్‌తో తొలి వన్డేకు ముందు నెట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అతడికి గాయమైంది. దీంతో పరిమిత మ్యాచ్‌ల సిరీస్‌ను జడేజా దూరమయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే అతడు గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం జడేజా..వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని..అతడు ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదని బీసీసీఐ అధికారులు తెలిపారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అతడు ఆడే పరిస్థితి లేదు. ఇప్పటికే వన్డే సిరీస్‌లో జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టుకు ఎంపికయ్యాడు. రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి సిక్సర్లు, ఫోర్లతో అలరించాడు. ఈక్రమంలో టీ20 సిరీస్‌లో అక్షర్‌ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


ఆల్‌రౌండర్ కోటాలో పాండ్య, అక్షర్‌ పటేల్‌ తుది జట్టులో ఉండనున్నారు. మరోవైపు కరోనా కారణంగా కేఎల్ రాహుల్ ..టీమిండియాకు దూరమయ్యాడు. దీంతో అతడి ప్లేస్‌లో ఓపెనర్‌గా పంత్‌ ఆడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20ల్లో రిషబ్‌ పంత్ ఓపెనర్‌గా వచ్చాడు. మొత్తంగా విండీస్‌ గడ్డపై ఐదు టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. రేపటి తొలి మ్యాచ్‌తో పొట్టి పోరు మొదలు కానుంది. 


భారత జట్టు(అంచనా)..


రోహిత్ శర్మ, పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, దినేష్‌ కార్తీక్, పాండ్యా, అక్షర్‌ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్‌ ఖాన్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్


Also read:IND vs WI: రేపటి నుంచి భారత్, విండీస్ మధ్య టీ20 ఫైట్..టీమిండియా జట్టు ఇదే..!


Also read:CM Kcr: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో మణిహారం..పోలీస్ టవర్స్‌ ప్రారంభించనున్న సీఎం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook