IND vs WI: విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఈమ్యాచ్‌లో 53 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఈక్రమంలో గిల్‌ సరికొత్త రికార్డు లిఖించాడు. వెస్టిండీస్ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన రెండో భారత అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలైంది. ఈరికార్డును సచిన్ 24 ఏళ్ల 3 రోజుల వయస్సులో నమోదు చేశాడు. యువ ఆటగాడు గిల్ 22 ఏళ్ల 317 రోజుల వయస్సులో రికార్డు సృష్టించాడు. మొత్తంగా తొలి ప్లేస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఉన్నాడు. అతడు కేవలం 22 ఏళ్ల 215 రోజుల వయసులో ఘనత సాధించాడు. 


విండీస్‌ గడ్డపై జరిగిన తొలి వన్డేలో భారత్‌ చివరి ఓవర్‌లో విజయం సాధించింది. అతిథ్య జట్టుపై మూడు పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేసింది.



Also read:CS Somesh Kumar: ఎట్టి పరిస్థితిల్లో ప్రాణ నష్టం జరగకూడదు..భారీ వర్షాలపై సోమేష్‌కుమార్‌ రివ్యూ..!


Also read:Ananya Nagalla: చిన్నగౌనులో పెద్ద పాప అనన్య నాగళ్ల.. ఇదేం అరాచకం.. ఫోటోలు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.