Team India Players Banned from Eating pork and Beef:  భారత్-న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో (Two Match Test Series) భాగంగా నవంబర్ 25 నుంచి కాన్పూర్ (Kanpur) వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్  జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా (Team India) ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన కొత్త ఫుడ్ మెనూ తాజాగా విడుదలైంది. ఇందులో 'హలాల్' (Halal) చేసిన మాంసాన్ని మాత్రమే తినాలని బీసీసీఐ (BCCI) ఆటగాళ్లను కోరింది. ఈ విషయంపై ఇపుడు సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆటగాళ్ల డైట్‌పై రచ్చ
నిజానికి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఇక నుంచి అందరికీ హలాల్‌ మాంసాన్ని మాత్రమే అందించాలని బీసీసీఐ నిర్ణయించిందని. అయితే గొడ్డు మాంసం తినొద్దు అన్న దానిపై సోషల్ మీడియాలో బీసీసీఐకి (BCCI) చాలా రకాల సూచనలు ఇస్తున్నారు. బీసీసీఐకి (Board of Control for Cricket in India) హలాల్ మాంసాన్ని ప్రమోట్ చేసే ప్రక్రియాలో ఉందని హేళన చేస్తున్నారు. 


Also Read: Hindi Jersey Trailer: 'ఆటిట్యూడ్ కా బాప్'..హిందీ జెర్సీ ట్రైలర్.. షాహిద్.. నానిని బీట్ చేశాడా..??


సోషల్ మీడియాలో ఆగ్రహం
బీసీసీఐ ఆటగాళ్లను హలాల్ మాంసం మాత్రమే తినాలని సూచించిన వార్త బయటకి రాగానే  #BCCI_Promotes_Halal ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయంపై  నెటిజన్లు బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.. ఈ విషయంపై అనేక రకాలుగా నెటిజన్లు రియాక్ట్ అవ్వటం.. ఇందులో ముఖ్యంగా హిందువులు (Hindus) కూడా బీసీసీఐపై ఆగ్రహానికి గురవటం విశేషం. 


పంది మరియు గొడ్డు మాంసం నిషేధం 
బీసీసీఐ విడుదల చేసిన కొత్త మెనూలో ఆటగాళ్లు కచ్చితంగా హలాల్ మాంసాన్ని మాత్రమే తినాలని విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని... ఆటగాళ్ల ఫుడ్ మెనూలోనుంచి పంది మరియు గొడ్డు మాంసాన్ని (Pork and Beef Excluded) బీసీసీఐ తిలగించటం వంటి విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. 












వాస్తవానికి, కొంతమంది ఆటగాళ్లు బయో బబుల్‌లో (Biobubble) ఉంటూ.. క్రికెట్ ఆడేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ తీసుకున్న హలాల్ మాంసం మాత్రమే తినాలన్న ఈ  నిర్ణయం వలన ఇస్లామిక్ మతానికి (Islamic Religion) ప్రాధాన్యత ఇవ్వబడుతుందని.. ఇతర మతాలైనట్టి హిందూ (Hindus), సిక్కు (Sikku) మతాల ప్రజల మనోభావాలు


Also Read: Viral Video: గ్లాసులో వాటర్ తాగుతున్న బ్లాక్ కోబ్రా.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం


దెబ్బతింటున్నాయని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తొలి టెస్టులో భాగంగా టీమిండియా కాన్పూర్‌లోని హోటల్ ల్యాండ్‌మార్క్ టవర్‌లో (Hotel Landmark Tower) బస చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook