T20 World Cup Final: తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టుకు కలిసొచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా, ఓటమి లేకుండా సెమీస్ చేరిన భారత్ విజయవంతంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
సిడ్నీ: ట్వంటీ20 ప్రపంచ కప్‌లో మహిళల జట్టు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. భారీ వర్షం కారణంగా గురువారం ఇంగ్లాండ్‌తో జరగాల్సిన జరగనున్న తొలి సెమీఫైనల్ ఒక్క బంతి పడకుండానే రద్దయింది. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో అంపైర్లు మ్యార్ రద్దయినట్లు ప్రకటించారు. దీంతో మెరుగైన పాయింట్లు, ఒక్క ఓటమి లేకుండా సెమీస్ చేరిన భారత మహిళల జట్టు తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. రిజర్వ్ డే లేకపోవడంతో ఇంగ్లాండ్ జట్టుకు నిరాశ తప్పలేదు.
రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేతతో భారత్ తమ తొలి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడనుంది. ఒకవేళ తొలి సెమీఫైనల్ మాదిరిగానే రెండో సెమీస్ రద్దయితే మాత్రం మెరుగైన పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికాకు ప్లాస్ పాయింట్ కానుంది. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచిన సఫారీ మహిళల జట్టు ఫైనల్ చేరుకుని, టైటిల్ పోరులో భారత్‌ను ఢీకొట్టనుంది. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది.