Team India Odi Squad: పదేళ్ల తరువాత వన్డే జట్టులోకి స్టార్ పేసర్ రీఎంట్రీ.. బీసీసీఐ నుంచి పిలుపు
Ind Vs Aus Odi Series 2023: ఆసీస్‌తో వరుసగా రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న భారత్.. చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను అనౌన్స్ చేయగా.. స్టార్ పేసర్ పదేళ్ల తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.
Ind Vs Aus Odi Series 2023: మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అదేవిధంగా చివరి రెండు టెస్టులకు కూడా టీమ్‌ను అనౌన్స చేసింది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గాయం తరువాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్న రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. స్పీడ్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ పదేళ్ల తరువాత మళ్లీ భారత వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2013లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఉనద్కత్.. అదే ఏడాది తన చివరి వన్డే ఆడాడు.
రంజీ ట్రోఫీ 2022-23 సౌరాష్ట్రకు అందించిన జయదేవ్‌కు బీసీసీ వన్డే జట్టులోకి పిలుపునిచ్చింది. ప్రస్తుతం టెస్ట్ జట్టులో కొనసాగుతన్న ఉనద్కత్.. బెంగాల్‌తో రంజీ ట్రోఫీ ఫైనల్ కోసం ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ నుంచి రిలీజ్ అయ్యాడు. జట్టుకు ట్రోఫీ అందించి.. మళ్లీ టీమిండియాతో చేరాడు. 2010లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఈ స్పీడ్ స్టార్.. 12 ఏళ్ల తరువాత ఇటీవలె టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు. గతేడాది డిసెంబర్‌లో మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడాడు.
పదేళ్ల తరువాత వన్డే జట్టులో కూడా ప్లేస్ దక్కింది. 31 ఏళ్ల జయదేవ్ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో 8 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆసీస్‌తో వన్డే జట్టులోకి ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, చివరిదైన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్.
Also Read: IND vs AUS: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు.. దూసుకుపోతున్న భారత్
Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి