టీమిండియా లక్ష్యం జస్ట్.. 135 మాత్రమే..!
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది.
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆదిలోనే హంసపాదులా శ్రీలంకకు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది.
రెండో ఓవరులో ఐదో బంతికి 8 పరుగుల స్కోరు వద్ద ఉనద్కత్ బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌వెల్లా (1) సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత లంక వికెట్ల పతనం మొదలైంది. భారత బౌలర్లు ధాటికి తట్టుకోలేక లంకేయులు వరుసగా వికెట్లు పోగొట్టుకున్నారు. లంక ఆటగాళ్ళల్లో అసెల గుణరత్నె చేసిన 36 పరుగులే అధిక స్కోరు.