Indian Cricket Team: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి.. టీమిండియా ఈ ఏడాదిని అద్భుతంగా ముగించింది. ఈ సంవత్సరం ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఫ్లాప్ షో కంటిన్యూ అయింది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అంతకుంము ఆసియా కప్‌లో ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. 2023 సంవత్సరంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ 


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టీమిండియా కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ భారత్ ఆడాలంటే..  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలవాల్సిందే. అప్పుడే టీమిండియా ఫైనల్స్‌కు చేరుకోగలదు.  


వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం


2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 1983, 2011లో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. 2013 నుంచి ఇప్పటివరకు భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. ఈ మహా సంగ్రామంలో రోహిత్ అండ్ కంపెనీ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. భారత పిచ్‌లు ఎప్పుడూ స్పిన్నర్లకు ఉపకరిస్తాయి. ఈ పిచ్‌లపై స్పిన్నర్లు అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. 


స్టార్ ప్లేయర్లు ఫామ్‌లో లేరు 


కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు చాలా కాలంగా తమ అత్యుత్తమ ఫామ్‌లో కనిపించడం లేదు. భారత టాప్ ఆర్డర్ గడ్డు దశలో ఉంది. బంగ్లాపై వన్డేల్లో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించినా.. టెస్టుల్లో విఫలమయ్యాడు. పెద్ద టోర్నమెంట్లలో బాగా రాణించాలంటే.. ఈ ఆటగాళ్లు వారి లయ అందుకోవాల్సింది. పేలవమైన ఫామ్ కారణంగా, ఈ ఆటగాళ్లను జట్టు నుండి తొలగించాలనే డిమాండ్ వచ్చింది. అదే సమయంలో ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ వంటి యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు.


Also Read: Coronavirus: కరోనా ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు  


Also Read: Winter Storm in US: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 34కి చేరిన మృతుల సంఖ్య


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook